చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే 300 వికెట్లలో పాలు పంచుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘనతను అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షా ఇచ్చిన క్యాచ్‌తో 300 ఔట్ల మైలు రాయిని అందుకున్నాడు.
ఈ జాబితాలో మరే వికెట్ కీపర్ కూడా ధోనీకి దరిదాపుల్లో కూడా లేరు. ఈ జాబితాలో 300 డిసిమిసల్స్‌తో ధోనీ అగ్రస్థానంలో ఉండగా.. కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274) రెండో స్థానంలో కొనసాగుతున్నారు. క్వింటన్ డికాక్(270), జోస్ బట్లర్(209) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52), రిషభ్ పంత్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. పృథ్వీ షా(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) మెరుపులు మెరిపించాడు.
చెన్నై బౌలర్లలో మతీష పతీరణ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. రీఎంట్రీ తర్వాత తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రిషభ్ పంత్..ఈ మ్యాచ్‌లో తన అసలు సిసలు ఆటను చూపించాడు. తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన అతను తర్వాతి 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు.