Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంఎస్ ధోనీ... జేబీఎస్‌కే సభ్యునిగా..!

MS Dhoni could be mentor CSK’s Joburg franchise if BCCI gives green signal

న్యూఢిల్లీ: ఐపీఎల్ తరహాలో సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ఈ సఫారీ లీగ్‌లో జోహన్నెస్ బర్గ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుకు ధోనీ మెంటార్‌గా వ్యవహరించే అవకాశాలున్నాట్లు సీఎస్‌కే వర్గాలు పేర్కొన్నాయి. అది కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందంట.

బీసీసీఐ అనుమతిస్తే..

బీసీసీఐ అనుమతిస్తే..

ఈ లీగ్‌లో పాల్గొనేందుకు భారత ఆటగాళ్లకు ఎన్‌ఓసీ లభిస్తే ధోనీ కూడా ప్లేయర్‌గా ఆడనున్నానడని, అలా కాదని మెంటార్‌గా అవకాశామిస్తే జట్టుకు మార్గదర్శిగా ఉంటాడని సీఎస్‌కేకు చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ ప్రతిబింబించేలా జోహన్నెస్ బర్గ్ ఫ్రాంచైజీకి జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని బుధవారమే సీఎస్‌కే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. సీఎస్‌కే తరహాలోనే జేబీఎస్‌కే సైతం అభిమానులను అలరిస్తొందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్..

కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్..

వచ్చే ఏడాది ప్రారంభంలో క్రికెట్‌ సౌతాఫ్రికా ఆధ్వర్యంలో జరిగే ఈ టీ20 లీగ్‌లో జేబీఎస్‌కేను ఫాఫ్ డుప్లెసిస్ నడిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఫాప్ డుప్లెసిస్‌తో సీఎస్‌కే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లీగ్ కోసం ఫ్రాంచైజీలు గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను నేరుగా తీసుకోవచ్చు. ఇందులో ఒకరు ఖచ్చితంగా సౌతాఫ్రికా ప్లేయర్ అయి ఉండాలి. ముగ్గురు విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఇద్దరికి మించి ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు ఉండకూడదు. ఒక అన్‌ క్యాపడ్‌ ప్లేయర్‌ ఉండాలి. ఈ ఆటగాళ్ల ఎంపికకు ఆగస్ట్‌ 10 డెడ్‌లైన్‌ కావడంతో సీఎస్‌కే యాజమాన్యం స్థానిక కోటాలో ఫాఫ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీలే..

ఐపీఎల్ ఫ్రాంచైజీలే..

కాగా, సఫారీ లీగ్‌లో పాల్గొనే మొత్తం ఆరు జట్లను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్‌ను ముంబై ఇండియన్స్, జొహన్నెస్‌బర్గ్‌ను సీఎస్‌కే, సెంచూరియన్‌, పార్ల్‌, డర్బన్‌, పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంచైజీలను ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యాలు దక్కించుకున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ ఫ్రాంచైజీ పేరును ఎంఐ కేప్‌టౌన్‌గా నామకరణం చేసింది.

Story first published: Thursday, August 11, 2022, 14:52 [IST]
Other articles published on Aug 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+