Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: సినిమాలా? మన వల్ల కాదు బ్రో!

MS Dhoni clarifies that he wont venture into Bollywood post retirement

న్యూఢిల్లీ: నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనే తనకు లేదని టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అడ్వర్టైజ్‌మెంట్స్ వరకే నటిస్తానని స్పష్టం చేశాడు. నటన అనేది అంత సులువైన పనికాదని, ప్రస్తుత సినీతారలు అద్భుతంగా చేస్తున్నారని చెప్పాడు. ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉన్న నేపథ్యంలో అతనికిదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతను ఇతర క్రికెటర్లలా సినిమాల్లోకి అరంగేట్రం చేస్తారని అంతా భావించారు.

నా చేతిలోని టీ కప్పు కాదు..

నా చేతిలోని టీ కప్పు కాదు..

ఈ నేపథ్యంలో సీఎస్‌కే అధికారిక యూట్యూబ్ చానెల్‌లో అభిమానులతో ముచ్చటించిన ధోనీ ముందు ఈ విషయం ప్రస్తావించగా తనకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశాడు. అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తానని, క్రికెట్‌లోనే ఉంటానని చెప్పాడు. 'బాలీవుడ్ నాకు సెట్‌కాదు . అడ్వర్టైజ్‌మెంట్స్ వరకు ఓకే. అవి చేయడానికి నేను సిద్దంగా ఉన్నా. కానీ సినిమాల్లో నటించడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని మేనేజ్‌ చేయడం మనవల్ల కాదు. బాలీవుడ్‌ను మన సినీతారలకే వదిలేస్తున్నా. వారు అద్భుతంగా నటిస్తున్నారు. నేను క్రికెట్‌లోనే ఉంటా. అడ్వర్టైజ్‌మెంట్స్‌కు మించి ఏవి చేయను.'అని ధోనీ స్పష్టం చేశాడు.

హర్భజన్‌తో సహా..

హర్భజన్‌తో సహా..

ఇప్ప‌టికే ప‌లువురు భారత క్రికెట‌ర్లు బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలు సినిమాల్లో నటించారు. అజ‌య్ జ‌డేజాతో మొద‌లు పెడితే, త‌మ గ్లామ‌ర్ ను ఇలా ఉప‌యోగించిన వారు ప‌లువురు ఉన్నారు.త‌మిళ‌నాడుకు చెందిన మాజీ ఓపెనర్ శ‌ఠ‌గోప‌న్ ర‌మేష్ అనేక సినిమాల్లో న‌టించాడు. సూప‌ర్ గ్లామ‌ర్ తో ఉండే ర‌మేష్ హీరోగా కాకుండా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు వేషాల్లో క‌నిపించాడు. హ‌ర్భ‌జ‌న్ సింగ్, శ్రీశాంత్‌లు సినిమాల్లో కెరీర్‌ను వెదుక్కొంటున్నారు. ఇక న‌వ్ జ్యోత్ సింగ్ సిద్ధూ క్రికెట్‌కు ధీటుగా బుల్లితెర‌పై ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడాయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు.

వచ్చే సీజన్ ఆడుతా..

వచ్చే సీజన్ ఆడుతా..

ఇక చెన్నై చెపాక్ స్టేడియంలోనే వీడ్కోలు మ్యాచ్‌ను ఆడతానని ధోనీ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడానికి ఆగస్టు 15వ తేదీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ సమాధానం ఇచ్చాడు. ఫేర్‌వెల్ మ్యాచ్‌లో చూడాలని అనుకుంటున్నామంటూ అతను చేసిన రిక్వెస్ట్‌కు సానుకూలంగా స్పందించాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఖచ్చితంగా తన ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందని హామీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ ఇప్పటికే వైదొలగాడు. ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.

Story first published: Thursday, October 7, 2021, 18:55 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+