Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మనషులకు దూరంగా.. వెరైటీగా ధోనీ బర్త్ డే పార్టీ! (వీడియో)

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం(జూలై 7) 42వ జన్మదినం జరుపుకున్న విషయం తెలిసిందే. క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖలతో పాటు అభిమానులు ధోనీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. నిన్న ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ చూసిన ధోనీ పేరుతో మారుమోగాయి. ప్రతీ ఒక్కరు ధోనీ సాధించిన విజయాలు గుర్తు చేసుకున్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం తన 42వ జన్మదినాన్ని మనషులకు దూరంగా జరుపుకున్నాడు. తనకు ఎంతో ఇష్టమైన మూగ జీవులు, పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోనీనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో కనీసం అతని కుటుంబ సభ్యులు కూడా లేకపోవడం గమనార్హం.

 MS Dhoni

తన ఫామ్ హౌస్‌లో నాలుగు పెంపుడు కుక్కల మధ్య కేక్ కట్ చేసి.. వాటికి తినిపిస్తూ తాను తింటూ బర్త్‌డేను గడుపుకున్నాడు. చిన్న బల్లపై ఉంచిన కేక్ ను కట్ చేసిన ధోనీ... చిన్న ముక్కలను తన కుక్కలకు గాల్లోకి విసరగా, అవి ఎగిరి అందుకున్నాయి. ఆపై తాను కూడా ఒకటి రెండు కేక్ ముక్కలు తినేసి ఈ ఏడాదికి బర్త్ డే వేడుకలను ముగించాడు.

 MS Dhoni

నిన్న మొత్తం ఫామ్‌ హౌజ్‌‌కు పరిమితమైన ధోనీ.. బర్త్ ‌డే పార్టీపై అయిష్టత కనబర్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. మనుషుల కంటే పెంపుడు జంతువులే ధోనీకి నచ్చుతున్నాయంటే.. అతన్ని ఎవరో బాగా హర్ట్ చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 MS Dhoni

ఏ ఉద్దేశంతో ధోనీ ఈ పని చేశాడో కానీ.. జంతు ప్రేమికులు మాత్రం ఫిదా అవుతున్నారు. ధోనీ తన చర్యతో అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచాడని కామెంట్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో చెన్నైని ఛాంపియన్‌గా నిలబెట్టిన ధోనీ.. ఐదో టైటిల్ అందించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సంపాదనలోనూ దుమ్మురేపుతున్నాడు. ధోనీ నెట్‌వర్త్ రూ.1040 కోట్లుగా ఉండటం విశేషం.

Story first published: Saturday, July 8, 2023, 17:57 [IST]
Other articles published on Jul 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+