For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni Birthday: విష్ చేయని రోహిత్ శర్మ.. విభేదాలే కారణమా?

MS Dhoni Birthday: Why Rohit Sharma Didnt Wish MSD

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు(బుధవారం) 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు ఈ జార్ఖండ్ డైనమైట్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏ సోషల్ మీడియా వేదిక చూసినా.. ఎవరి స్టేటస్‌ల చూసినా.. ధోనీ పేరు మారుమోగుతోంది. భారత క్రికెట్‌కు అతను సాధించిన విజయాలను అభిమానులు నెమరవేసుకుంటున్నారు. సినీ, రాజకీయ, క్రీడా అన్ని రంగాల ప్రముఖులు మహీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు. టీమిండియా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం ధోనీకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, బీసీసీఐ, ఐసీసీతో పాటు అందరూ ఈ జార్ఖండ్ డైనమైట్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పకపోవడం క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేస్తోంది. ఇతర ఆటగాళ్లంతా మహీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినప్పుడు.. రోహిత్ ఒక్కడే సైలెంట్‌గా ఉండటం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలున్నాయా? అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంగ్లండ్ పర్యటనలో సెలవులను ఆస్వాదిస్తున్న రోహిత్.. మహీ బర్త్ డే విషయం మరిచిపోయి ఉంటాడని, వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉండే అవకాశం లేదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సచిన్ టెండూల్కర్ సైతం మహీకి ఆలస్యంగా బర్త్ డే విషెస్ తెలియజేశాడు.

సౌరవ్ గంగూలీ సారథ్యంలో డిసెంబర్‌ 23, 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి మహీ.. ఫస్ట్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కానీ విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ మహీ జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. విధ్వంసకర బ్యాటింగ్‌తో 123 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌ తర్వాత మహీకి తిరుగే లేకుండా పోయింది. అతి తక్కువ కాలంలోనే జట్టు పగ్గాలు అందుకున్న ధోనీ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని నెగ్గి మూడు ఐసీసీ టైటిళ్లు నెగ్గిన తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. అనూహ్యంగా 2014లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ.. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.

Story first published: Wednesday, July 7, 2021, 13:40 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+