
హైదరాబాద్: క్రికెట్ ప్రపంచంలో విజయవంతమైన కెప్టెన్‌గా భారత జట్టును కొత్త పుంతలు తొక్కించాడు ఎంఎస్ ధోనీ. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా జట్టుకు ఎనలేని సేవలు అందించాడు. వన్డే క్రికెట్ చరిత్రలోని ఉత్తమ ఫినిషర్లలో ధోనీ ఒకడు. కేవలం భారతే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనూ ఎవరికీ సాధ్యం కానివి అతడు సాధించి పెట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్‌లు, మూడు ఐపీఎల్ ట్రోఫీలు అతడి ఖాతాలో ఉన్నాయి. బుధవారం (జులై 7) ధోనీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఆదాయం ఓసారి చూద్దాం.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది గడిచినా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 826 కోట్లు. ఇందులో సగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారానే వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 15 కోట్లు వస్తుంది. ఒక్కో ప్రకటనకు మహీ 1-3 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. ప్రస్తుతం మహీ ఖాతాలో అటుఇటుగా 15 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి.
ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్నపుడు A+ కేటగిరిలో ఉన్నందున అతడికి 7 కోట్లు బీసీసీఐ చెల్లించేది. ఇక ప్రతి మ్యాచుకు కూడా ఫీ ఉంటుంది. ఇలా బీసీసీఐ నుంచి వార్షిక ఆదాయం రూ. 50 కోట్లు మహీకి వచ్చేవి. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 15 కోట్లు. మహీకి ఉన్న పలు కంపెనీలు, వ్యవసాయం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా అధిక మొత్తం పొందేవాడు. 2021 వరకు ధోనీ ఐపీఎల్ లీగ్ ద్వారా రూ.150 కోట్ల ఆదాయం పొందినట్టు సమాచారం.
అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. 16 ఏళ్ల కెరీర్‌లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న మహీ.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.