Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni Birthday:పాక్ అధ్యక్షుడు మెచ్చిన హెయిర్ స్టైల్‌ను మహీ ఎందుకు తీసేసాడంటే.?

MS Dhoni Birthday: Did MSD sacrifice his long hair for Deepika Padukone?

న్యూఢిల్లీ: భారతీయ క్రికెట్‌లో తారజువ్వలా దూసుకొచ్చిన ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ! టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్‌ ట్రోఫీ..అన్ని ఫార్మాట్లలో నెంబర్‌ వన్‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. విజయాన్ని అందరి ఖాతాలో వేసి.. అపజయాన్ని తన ఖాతాలో వేసుకునే గొప్ప దార్శనికుడు. భారత క్రికెట్‌ గతిని మార్చి.. కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన డైనమైట్‌.

అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడు నేడు(గురువారం) 41వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ లెజెండ్‌కు శుభాకాంక్షలు తెలుపుతుంది. అతని కెరీర్‌లోని చిర్మసర్మనీయ క్షణాలను గుర్తు చేసుకుంటుంది.

 ధోనీ హెయిర్ స్టైల్‌కు ఫిదా

ధోనీ హెయిర్ స్టైల్‌కు ఫిదా

ఇక ధోనీ జులపాల జుట్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విశాఖ వేదికగా పాకిస్థాన్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాంతో అతని హెయిర్ స్టైల్‌కు కూడా క్రేజ్ వచ్చింది.

ఎంతలా పాపులర్‌ అయిందంటే.. మహీ హెయిర్‌స్టైల్‌ను యువతను అనుకరించేంత. ధోనీ హెయిర్ స్టైల్‌కు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ఫిదా అయ్యాడు. ధోనీ హెయిర్‌స్టైల్‌ను అమితంగా ప్రేమించిన ముషారఫ్‌ జుట్టు కట్‌ చేయించుకోవద్దని రిక్వెస్ట్‌ చేయడం కూడా అప్పట్లో బాగా వైరల్‌ అయింది.

 2006 పాక్ పర్యటనలో..

2006 పాక్ పర్యటనలో..

ధోనీ బర్త్‌డే సందర్భంగా మరోసారి ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ని 4-1తో గెలుచుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ రాగా.. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. చేజింగ్‌లో భారత్ జట్టును గెలిపించాడు. ఆ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగా.. ధోనీ దూకుడుతో 47.4 ఓవర్లలో భారత్ 292/5తో విజయాన్ని అందుకుంది.

2007 టీ20 ప్రపంచకప్ తర్వాత..

2007 టీ20 ప్రపంచకప్ తర్వాత..

మ్యాచ్‌ను ధోనీ ముగించిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. మ్యాచ్ అనంతరం ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ముఖ్యంగా అతని హెయిర్‌ స్టైల్ ప్రశంసించాడు. 'ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్‌లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ స్టైల్ మార్చకు'అని రిక్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టైల్‌ను కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం జులపాల జుట్టును కత్తరించి అందరికీ షాకిచ్చాడు.

దీపికా కోసం..

దీపికా కోసం..

యావత్ ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోనీ ఎందుకు వదులుకున్నాడనేది ఇప్పటికీ సస్పెన్స్. అయితే దీనిపై రకరకాల ఉహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆ ‌టైమ్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేతో ధోనీ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వెలువడ్డాయి. మరోవైపు యువ రాజ్ సైతం దీపికా పదుకునేపై మనసు పారేసుకున్నాడని, ముగ్గురి మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడించిందని ప్రచారం జరిగింది. దీపికా కోసమే ధోనీ హెయిర్ స్టైల్ మార్చుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ... ఆ సమయంలో దీపికా పదుకొనే, మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని కోరిందట. ఆమె కోరికను మన్నించిన మాహీ, వెంటనే హెయిర్ స్టైల్ మార్చేశాడంటారు.

Story first published: Thursday, July 7, 2022, 16:30 [IST]
Other articles published on Jul 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+