Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ బయోపిక్ రీరిలీజ్.. ఎప్పుడంటే?

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత సినిమాలను ఆయా నిర్మాణ సంస్థలు 4కే ప్రింట్స్‌తో అభిమానులకు అందిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, తొలి ప్రేమ సినిమాలతో పాటు మహేశ్ బాబు, సూపర్ స్టార్, దివంగత నటుడు కృష్ణ సినిమాలు రీరిలీజ్ అయ్యి అభిమానులను అలరించాయి.

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాను రిరీలిజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ధోనీ బర్త్‌డే జూలై 7న తెలుగు రాష్ట్రాల్లో ధోనీ అన్‌టోల్డ్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటిచింది.

 MS Dhoni biopic

2016లో విడుదలైన ఈ సినిమాలో ధోనీ పాత్రలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించగా.. దిశా పటాని, కియారా అద్వానీ, భూమిక, అనుపమ్ ఖేర్.. కీలక పాత్రలు పోషించారు.

ధోనీ బాల్యం నుంచి క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తీరు, భారత జట్టులోకి ఎలా వచ్చాడనేదానితో పాటు.. అతను పడిన బాధలు, సక్సెస్, 2011 వరల్డ్ కప్‌ను ఎలా సాధించాడనే అన్ని అంశాలతో భావోద్వేగంగా, ఆసక్తిగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫిస్‌ను షేక్ చేసింది. బయోపిక్‌ మూవీల్లో అత్యధిక జనాధరణ పొందిన చిత్రంగా చరిత్రకెక్కింది.

 MS Dhoni biopic

అప్పట్లో ఈ మూవీ రూ.133.04 కోట్లు వసూల్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కెరీర్‌లోనే ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిపోయింది. అయితే వ్యక్తిగత సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ మూవీని మళ్లీ రిలీజ్ చేయడాన్ని సుశాంత్ అభిమానులు కూడా సంతోషిస్తున్నారు.

Story first published: Monday, June 26, 2023, 15:38 [IST]
Other articles published on Jun 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+