
ప్రత్నామ్నాయంగా మారిన అంబటి రాయుడు
ఈ సిరిస్‌తో భారత జట్టుకు అంబటి రాయుడు ప్రత్నామ్నాయంగా మారాడు. వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే అంబటి రాయుడిని నాలుగో స్థానానికి ప్రమోట్ చేశామని ఓ ప్రెస్ మీట్‌లో కోహ్లీనే స్వయంగా చెప్పాడు. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు మొత్తం నాలుగు వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాయుడు 217 పరుగులు చేశాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో రాయుడు సెంచరీతో మెరిశాడు.

162 పరుగులతో రోహిత్ శర్మ రికార్డు
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(162) పరుగులతో అనేక రికార్డులను నెలకొల్పినప్పటికీ... రాయుడు సెంచరీ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచీ తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ 80 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(16) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు అంచనాలకు మించి రాణించాడు.
భారత్ తరుపున 44 వన్డేలాడిన అంబటి రాయుడు
గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 22, వైజాగ్ వన్డేలో 73, పుణె వన్డేలో 22 తాజాగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన వన్డేలో సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో అంబటి రాయుడుకి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో 44 వన్డేలాడిన అంబటి రాయుడు 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 1447 పరుగులు చేశాడు.

రాయుడు రెండు చేతులా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు
ఈ సెంచరీతో అంబటి రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియాలో దాదాపు చోటు ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "అవకాశాన్ని రాయుడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 2019 ప్రపంచకప్ వరకు మేం అతడికి మద్దతుగా నిలవాల్సి ఉంది. ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటూ రాయుడు ముందుకు సాగుతున్నాడు. ఎట్టకేలకు ఓ తెలివైన ఆటగాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని అన్నాడు.
రాయుడి ప్రదర్శనపై సచిన్ టెండూల్కర్
నాలుగో వన్డేలో అంబటి రాయుడి ప్రదర్శనపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబై వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడిన అంబటి రాయుడు సెంచరీ సాధించడానికి అన్ని విధాలా అర్హుడని సచిన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.


Click it and Unblock the Notifications












