న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కెరీర్‌లో మరో మైలు రాయి.. సచిన్ తర్వాతి స్థానం అతనిదే

MS Dhoni becomes second most capped cricketer for India after Sachin Tendulkar

న్యూ ఢిల్లీ: దనాదన్ ధోనీ పరుగుల విషయంలోనే కాదు. కెప్టెన్సీలోనూ రికార్డుల విషయంలోనూ ఎందరో దిగ్గజాలను దాటేశాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మూడో భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు ధోనీ. ఆసియా కప్‌లోని సూపర్ 4లో భాగంగా టీమిండియా అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది.

ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్‌ (664)

ఎవరికీ అందనంత ఎత్తులో సచిన్‌ (664)

వన్డే, ధోనీ కెరీర్‌లో ఓవరాల్‌గా 509వ మ్యాచ్. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన భారత క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంతో రాహుల్‌ ద్రవిడ్‌ (509) సరసన చేరనున్నాడు. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తో ద్రవిడ్‌ను అదిగమించి 510 మ్యాచ్‌లతో సచిన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించనున్నాడు. భారత్‌ నుంచి దిగ్గజ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ (664 మ్యాచ్‌లు) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ధోనీ.. టెండూల్కర్‌తో సహా భారత్-పాక్‌ల అత్యుత్తమ 11జట్టిదే

అన్ని ఫార్మాట్లలో కలిపి 500 దాటేసి

అన్ని ఫార్మాట్లలో కలిపి 500 దాటేసి

అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన క్రికెటర్ల జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, సనత్‌ జయసూర్య, రికీ పాంటింగ్‌, షాహిద్‌ అఫ్రిది, కల్లిస్‌, ద్రవిడ్‌లు ఎంఎస్ ధోనీ కన్నా ముందున్నారు. 2004లో బంగ్లాదేశ్‌పై తొలి అంతర్జాతీయ వన్డే ఆడిన ధోని.. జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20తో 500వ (అన్ని ఫార్మాట్లలో కలిపి) మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు.

కెప్టెన్సీలో ఐసీసీ పలు ట్రోఫీలను భారత్..

కెప్టెన్సీలో ఐసీసీ పలు ట్రోఫీలను భారత్..

శ్రీలంకపై 2005లో టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిస్టర్ కూల్... 2006లో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ టీ20తో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ధోనీ మొత్తం 90 టెస్టులు, 325 వన్డేలు, 93 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ కెప్టెన్సీలో ఐసీసీ మేజర్ టోర్నీలను భారత్ సాధించింది. భారత్‌ 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 ప్రపంచకప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

మాజీ కెప్టెన్ ధోనీ సూచనలతో జట్టును..

మాజీ కెప్టెన్ ధోనీ సూచనలతో జట్టును..

ఆసియా వ్యాప్తంగా జరుగుతోన్న టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు చేరేందుకు మరో మ్యాచ్ దూరమే మిగిలుంది. టోర్నీ ఆరంభం నుంచి కెప్టెన్ కోహ్లీ లేకపోయినా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ.. మాజీ కెప్టెన్ ధోనీ సూచనలతో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ మేరకు టీమిండియా మంగళవారం అఫ్గాన్ జట్టుతో నామమాత్రమైన మ్యాచ్‌లో ఆడనుంది.

Story first published: Tuesday, September 25, 2018, 15:11 [IST]
Other articles published on Sep 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X