
రూ.12 కోట్ల కాంట్రాక్ట్..
ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించినా... సొంత అభిమానుల సమక్షంలోనే వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. దాంతో అతని రిటైర్మెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌కు వాయిదాపడింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఇక మెగావేలానికి ముందు చేపట్టిన రిటెన్షన్ ప్రక్రియ.. ముగియగా చెన్నై సూపర్ కింగ్స్ ధోనీతో సహా రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటైన్ చేసుకుంది.
ఆశ్చర్యకరంగా ధోనీకి రూ.12 కోట్ల కాంట్రాక్టే ఇచ్చిన చెన్నై ఫ్రాంచైజీ.. జడేజాకు రూ.16 కోట్లు, మొయిన్ అలీ రూ. 6 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కు రూ.8 కోట్లు చెల్లించేందుకు సిద్దమైంది. అయితే ధోనీ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రూ. 149 కోట్లతో టాప్..
ఇక తాజా సీజన్ రూ.12 కోట్ల కాంట్రాక్టు కలుపుకొని 14 ఏళ్ల ఐపీఎల్ లీగ్ చరిత్రలో ధోనీ ఇప్పటి వరకు రూ. 149 కోట్లు సంపాదించాడు. ఇదంతా ఫ్రాంచైజీ సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా లభించినదే. మ్యాచ్ ఫీజులు, అలవెన్స్ అదనం. 2008 అరంగేట్ర సీజన్‌లో ధోనీని రూ. 6 కోట్లకు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. మరో మూడేళ్ల వరకు అదే కాంట్రాక్ట్‌ను కొనసాగించింది.
2011 ఐపీఎల్ సీజన్ నుంచి 2013 వరకు రూ. 8 కోట్ల కాంట్రాక్టు అందుకున్నాడు. 2014 నుంచి 2017 వరకు ధోనీకి రూ. 12.5 కోట్ల కాంట్రాక్టు దక్కింది. ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్‌లో చెన్నై జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ధోనీ ఆడాడు.

కోహ్లీ కన్నా రోహిత్‌కే ఎక్కువ..
2018లో మళ్లీ ఐపీఎల్‌లోకి చెన్నై సూపర్ కింగ్స్ రీఎంట్రీ ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ ధర రూ.15 కోట్లకి పెరిగింది. అప్పటి నుంచి మొన్నటి ఐపీఎల్ 2021 సీజన్ వరకు అదే కాంట్రాక్టులో కొనసాగాడు. అప్‌కమింగ్ సీజన్‌కు మాత్రం రూ.3 కోట్లు దక్కి రూ.12 కోట్ల కాంట్రాక్టు అందుకున్నాడు. ఐపీఎల్‌లో గత మూడేళ్ల నుంచి ఏటా రూ.17 కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ నుంచి తీసుకుంటున్న విరాట్ కోహ్లీ వచ్చే సీజన్ కోసం రూ.15 కోట్ల కాంట్రాక్టు అందుకున్నాడు.
దాంతో ఇప్పటి వరకూ అతను రూ.141 కోట్లు ఆర్జించాడు. ఇక రోహిత్ శర్మ కూడా గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నుంచి రూ.15 కోట్లు ఆర్షించాడు. వచ్చే ఏడాది జరిగే సీజన్ కోసం అతనికి రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కగా.. అతని సంపాదన రూ.147 కోట్లకు చేరింది. ధోనీ కంటే రూ.2 కోట్లు మాత్రమే తక్కువగా సంపాదించాడు.

10 జట్లతో ఐపీఎల్ 2022
కొత్త జట్లలో అహ్మదాబాద్ బేస్ ఫ్రాంఛైజీని సీవీసి క్యాపిటల్స్ రూ.5625 కోట్లుకు దక్కించుకోగా.. లక్నో బేస్ టీమ్‌ను రూ. 7090 కోట్లకు గోయెంక గ్రూప్‌కు చెందిన ఆర్‌పీఎస్‌జీ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త ఫ్రాంచైజీలు ముగ్గురేసి ఆటగాళ్లను నేరుగా ఎంచుకోవచ్చు. దానికి రూ.90 కోట్ల టీమ్ పర్స్ నుంచి రూ.33 కోట్లు ఖర్చు చేయాలి.
అంతేకాకుండా తొలి ఆటగాడికి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 11 కోట్లు, మూడో ఆటగాడికి రూ.7 కోట్లు చెల్లించాలి. అయితే ఈ సాలరీ రూల్స్‌పై స్పష్టత లేదు. ముగ్గురిని తీసుకుంటే ఇలా ఉండాలన్నారు. కానీ ఒక్కరిని, ఇద్దరిని తీసుకుంటే ఏంటనేది చెప్పలేదు. ఇక ఈ పికప్ జాబితాను సమర్పించేందుకు బీసీసీఐ డిసెంబర్ 25గా డెడ్‌లైన్ విధించింది. జనవరి తొలి వారంలో మెగా వేలం జరగనుంది.


Click it and Unblock the Notifications












