
కెప్టెన్‌గా 100వ విజయం
చెన్నై సూపర్ కింగ్స్ తాజా విజయంతో ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీకి ఇది 100వ విజయం. అంటే కెప్టెన్‌గా చెన్నై జట్టుకు శతక విజయం సాధించాడు. దీంతో ఒక ఫ్రాంచైజీకి 100 మ్యాచ్‌లు గెలిపించిన తొలి కెప్టెన్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 100వ విజయం అందుకున్నది కూడా ధోనీనే కావడం విశేషం. ఏడాదికి పైగా మైదానంలోకి బరిలోకి దిగకపోయినా.. తన సత్తా ఏంటో ధోనీ మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి రుచిచూపించాడు. జట్టులో తాను ఎంత విలువైన ఆటగాడో చాటిచెప్పాడు.

మొత్తంగా 105వ విజయం:
అయితే ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఇది 105వ విజయం. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు 5 విజయాలు అందించాడు. ఇక కెప్టెన్‌గా మహీ 175 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 175 మ్యాచ్‌లలో 105 విజయాలు, 69 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 110 మ్యాచ్‌లలో బెంగళూరు ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. ఇందులో 55 ఓటములు, 49 విజయాలు ఉన్నాయి. కెప్టెన్‌గా 105 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ (ముంబై).. 60 విజయాలు, 43 ఓటములను ఖాతాలో వేసుకున్నాడు.

39 ఏళ్ల వయసొచ్చినా:
ఏడాదికి పైగా విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలో కనిపించిన ఎంఎస్ ధోనీ అభిమానులను ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్య క్యాచ్‌ను డైవ్ చేస్తూ అందుకున్న తీరు మురిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసినా.. 39 ఏళ్ల వయసొచ్చినా తనలో చురుకుదనం తగ్గలేదని వికెట్‌కీపింగ్‌తో రుజువు చేశాడు. ఇక తనదైన కెప్టెన్సీతో చివరి ఓవర్లలో ముంబైని దెబ్బ తీసిన వైనమూ ఆకట్టుకుంది. చెన్నై విజయానికి చేరువయ్యాక మహీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికి క్యాచౌట్‌గా అంపైర్ ప్రకటించగా.. సమీక్ష కోరి నాటౌట్‌గా తేలాడు.

చిందేసిన చెన్నై:
ఈ మ్యాచులో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (42; 31 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్. ముంబైని ఎంగిడి (3/38), చహర్ (2/32), కరన్ (1/28) కట్టడి చేశారు. అనంతరం అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్ (58 నాటౌట్; 44 బంతుల్లో 6×4) మెరుపులతో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయుడు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
యూఏఈ క్రికెట్ బోర్డుతో ఒప్పందం.. ఐపీఎల్ 2021 కూడా యూఏఈలోనే!!


Click it and Unblock the Notifications












