For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైపై విజయం.. ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు!!

MS Dhoni becomes first captain to win 100 matches for a franchise
Mumbai Indians Vs Chennai Super Kings: Match Highlights | IPL 2020 | Oneindia Telugu

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాకిస్తూ టోర్నీలో చెన్నై సూపర్‌ కింగ్స్ శుభారంభం చేసింది. శనివారం అబుదాబిలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తొలి మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్‌ సేన చేతిలో వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిన చెన్నై చివరకు విజయాన్ని అందుకుంది. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో లీగ్‌ తొలి మ్యాచ్‌లలో తమ పేలవ రికార్డును ముంబై కొనసాగించింది.

కెప్టెన్‌గా 100వ విజయం

కెప్టెన్‌గా 100వ విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్ తాజా విజయంతో ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీకి ఇది 100వ విజయం. అంటే కెప్టెన్‌గా చెన్నై జట్టుకు శతక విజయం సాధించాడు. దీంతో ఒక ఫ్రాంచైజీకి 100 మ్యాచ్‌లు గెలిపించిన తొలి కెప్టెన్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 100వ విజయం అందుకున్నది కూడా ధోనీనే కావడం విశేషం. ఏడాదికి పైగా మైదానంలోకి బరిలోకి దిగకపోయినా.. తన సత్తా ఏంటో ధోనీ మరోసారి క్రికెట్ ఫ్యాన్స్‌కి రుచిచూపించాడు. జట్టులో తాను ఎంత విలువైన ఆటగాడో చాటిచెప్పాడు.

మొత్తంగా 105వ విజయం:

మొత్తంగా 105వ విజయం:

అయితే ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీకి ఇది 105వ విజయం. 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు 5 విజయాలు అందించాడు. ఇక కెప్టెన్‌గా మహీ 175 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం. 175 మ్యాచ్‌లలో 105 విజయాలు, 69 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 110 మ్యాచ్‌లలో బెంగళూరు ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. ఇందులో 55 ఓటములు, 49 విజయాలు ఉన్నాయి. కెప్టెన్‌గా 105 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ (ముంబై).. 60 విజయాలు, 43 ఓటములను ఖాతాలో వేసుకున్నాడు.

39 ఏళ్ల వయసొచ్చినా:

39 ఏళ్ల వయసొచ్చినా:

ఏడాదికి పైగా విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే మళ్లీ మైదానంలో కనిపించిన ఎంఎస్ ధోనీ అభిమానులను ఆకట్టుకున్నాడు. కృనాల్‌ పాండ్య క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ అందుకున్న తీరు మురిపించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసినా.. 39 ఏళ్ల వయసొచ్చినా తనలో చురుకుదనం తగ్గలేదని వికెట్‌కీపింగ్‌తో రుజువు చేశాడు. ఇక తనదైన కెప్టెన్సీతో చివరి ఓవర్లలో ముంబైని దెబ్బ తీసిన వైనమూ ఆకట్టుకుంది. చెన్నై విజయానికి చేరువయ్యాక మహీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతికి క్యాచౌట్‌గా అంపైర్‌ ప్రకటించగా.. సమీక్ష కోరి నాటౌట్‌గా తేలాడు.

చిందేసిన చెన్నై:

చిందేసిన చెన్నై:

ఈ మ్యాచులో మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. సౌరభ్‌ తివారి (42; 31 బంతుల్లో 3×4, 1×6) టాప్ ‌స్కోరర్‌. ముంబైని ఎంగిడి (3/38), చహర్‌ (2/32), కరన్‌ (1/28) కట్టడి చేశారు. అనంతరం అంబటి రాయుడు (71; 48 బంతుల్లో 6×4, 3×6), ఫాఫ్ డుప్లెసిస్‌ (58 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4) మెరుపులతో చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయుడు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

యూఏఈ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం.. ఐపీఎల్‌ 2021 కూడా యూఏఈలోనే!!

Story first published: Sunday, September 20, 2020, 8:24 [IST]
Other articles published on Sep 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+