IPL 2022 Mega Auction వేదికపై వీడని సస్పెన్స్! చెన్నైకి చేరిన ధోనీ!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ప్లేస్ ఎక్కడనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. వేలం జరిగే ప్లేస్‌పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫ్రాంచైజీలన్నీ అయోమయంలో పడ్డాయి. పాత షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో వేలం ప్రక్రియను నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడటంతో ఆక్షన్ డేట్స్‌తో పాటు వేదికల్లో కూడా మార్పులు ఉంటాయని బోర్డు తెలిపింది. వచ్చే నెల 12, 13న వేలం ఉంటుందని బోర్డు పేర్కొన్నా.. ప్లేస్‌ను మాత్రం ఖరారు చేయలేదు. మెగా ఆక్షన్‌కు హైదరాబాద్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. లీగ్ నిర్వహణ గురించి 10 ఫ్రాంచైజీలతో సమావేశం కూడా నిర్వహించింది. వేదిక విషయంలో వారి అభిప్రాయాలను కూడా సేకరించింది. అయితే భారత్ వేదికగానే ఐపీఎల్ 2022 నిర్వహించాలని పది ఫ్రాంచైజీలు కోరాయి. బోర్డు సైతం తమ తొలి ప్రాధాన్యత భారత్‌కే ఇస్తుండగా.. ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది. ఇప్పటికే శ్రీలంక, సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులు ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తికనబరుస్తున్నాయి. కరోనా ఉదృతి ఎక్కువగా ఉంటే లీగ్ సౌతాఫ్రికాకు తరలిపోయే ప్రమాదం ఉంది.
మరోవైపు మెగావేలానికి అన్ని ఫ్రాంచైజీలు సమాయత్తమవుతున్నాయి. పకడ్బందీ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇక ఏ విషయంలోనైనా అందరికన్నా ముందే ఉండే చెన్నై సూపర్ కింగ్స్.. మెగా వేలం కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. కెప్టెన్‌గా తనకు ఇది చివరి వేలం కావడంతో మహీ సీరియస్‌గా దీనిపై దృష్టిపెట్టాడు. రాబోయే పదేళ్లు అందుబాటులో ఉండేలా మంచి కోర్ గ్రూప్‌ను రెడీ చేయాలని చూస్తున్నాడు. మహీ కూడా డైరెక్ట్‌గా వేలానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications