Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ అరుదైన జాబితాలో భారత్ నుంచి ధోనీ, రోహిత్ ఇద్దరే!!

 MS Dhoni and Rohit Sharma are only Indians part of an elite list
MS Dhoni And Rohit Sharma Are Only Indians Part Of An Elite List

హైదరాబాద్: అత్యంత అరుదైన రికార్డు లిస్ట్‌లో భారత్ నుంచి మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మనే చోటు దక్కించుకున్నారు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలకు సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డును రోహిత్, ధోనీ తమ పేరిట లిఖించుకున్నారు.

ఇంతకీ ఆ రికార్డు ఏంటనుకుంటున్నారా? మూడు ఫార్మాట్లలో 50కు పైగా సిక్స్‌లు కొట్టిన ప్లేయర్ల లిస్ట్. అవును భారత్ నుంచి టీ20, టెస్ట్, వన్డే ఇలా మూడు ఫార్మాట్లలో యాబైకు పైగా సిక్స్‌లు కొట్టింది రోహిత్, ధోనీనే కావడం విశేషం, రోహిత్ టెస్ట్‌ల్లో 52, వన్డేల్లో 244, టీ20ల్లో 127 సిక్స్‌లు కొట్టి ధోనీ కన్నా ముందుండగా.. జార్ఖండ్ డైనమైట్ మాత్రం టెస్ట్‌ల్లో 78, వన్డేల్లో 229, టీ20ల్లో 52 సిక్స్‌లు బాదాడు. ఇక ఓవరాల్‌గా 423 సిక్స్‌లతో రోహిత్ మూడో స్థానంలో ఉండగా.. గేల్ (534), అఫ్రిది(476) హిట్‌మ్యాన్ కన్నా ముందున్నారు. ఇక ధోనీ (359) సిక్స్‌లతో మెక్‌కల్లమ్ (398) తర్వాత ఐదో స్థానంలో నిలిచాడు.

కెరీర్ ప్రారంభంలో ధోనీని చూసి అతను దేశ క్రికెట్‌ను ఇంతలా ప్రభావితం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మహీ.. అటు వికెట్ల వెనుకాల కూడా మైమరిపించాడు. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ ఇలా ఐసీసీ టోర్నీలన్నీ అందించాడు. ఇక అతని సారథ్యంలోనే 2007 ప్రపంకప్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మలోని నైపుణ్యం గుర్తించి అండగా నిలిచాడు. మెళ్లిగా 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ చేసి ప్రపంచానికి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ను అందజేశాడు. ఆ రోజు మహీ తీసుకున్న ఈ నిర్ణయంతోనే రోహిత్.. క్రికెట్ ప్రపంచానికి హిట్‌మ్యాన్ అయ్యాడు. అలవోకగా ట్రిపుల్ డబుల్ సాధించాడు.

Story first published: Sunday, April 26, 2020, 18:39 [IST]
Other articles published on Apr 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+