Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: ఇప్పుడంటే మిస్టర్ పర్‌ఫెక్ట్.. కానీ అప్పట్లో మంచి రసికుడు!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు(జూలై 7) 42వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. అతని కెరీర్ హైలైట్స్‌ను నెమరువేసుకుంటున్నారు. కొందరైతే ధోనీ లవ్ ఎఫైర్స్ గురంచి కూడా మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడంటే పెళ్లి చేసుకొని ధోనీ బుద్దిగా ఉంటూ మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు. కానీ.. పెళ్లికి ముందు ధోనీకి సంబంధించి చాలా పుకార్లు వెలువడ్డాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నుంచి సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మీ వరకు ధోనీ చాలా మంది హీరోయిన్స్‌తో ప్రేమాయణం నడపాడని అప్పట్లో అనేక గాసిప్స్ హల్‌చల్ చేశాయి.

MS Dhoni allegedly dated these heroins before getting married to Sakshi

దీపికా పదుకొనే కోసం ధోనీ తన హెయిర్ స్టైల్‌ను కూడా మార్చుకున్నాడని అప్పట్లో బాలీవుడ్ కోడై కూసింది. యువ రాజ్ సింగ్ కూడా దీపికాను ఇష్టపడటంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని ప్రచారం జరిగింది. ధోనీ, యువరాజ్ మధ్య గొడవలకు దారి తీసిందని కూడా అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి.

సౌతిండియా హీరోయిన్ ఆసిన్‌తో కూడా ధోనీ ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అసిన్ ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు చెక్ పడింది.

మరో సౌత్ ఇండియన్ హీరోయిన్ లక్ష్మీరాయ్‌తో కూడా ధోనీ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చాలా రోజుల పాటు ప్రేమించుకున్న ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. ధోనీ బయోపిక్ చిత్రం 'ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ'లో లవర్ పాత్ర లక్ష్మీరాయ్‌దేనని, బ్రేకప్ అవ్వడంతో సినిమాలో చనిపోయినట్లు చూపించారనే వాదన కూడా ప్రచారంలో ఉంది.

అనేక రుమార్లు వినిపించిన తర్వాత 2010లో సాక్షి రావత్‌ను ధోనీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 'ఎమ్మెస్ ధోనీ' సినిమాలో చెప్పినట్టు సాక్షి, ధోనీ మధ్య పరిచయం వింతగా ఏమీ జరగలేదు. సాక్షి సింగ్ రావత్ ఓ హోటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా ధోనీకి ఆమె పరిచయం అయ్యింది.

అయితే సాక్షి తన చిన్ననాటి స్నేహితురాలనే విషయం తెలుసుకున్న ధోనీ, ఆమె నెంబర్ తీసుకుని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత తన బర్త్ డే పార్టీలో ఆమెకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ధోనీ మిస్టర్ పర్‌ఫెక్స్ అయిపోయాడు. ఆటతో పాటు బిజినెస్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు.

Story first published: Friday, July 7, 2023, 15:34 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+