Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్ అయ్యర్‌తో ఆ తెలుగు హీరోయిన్ డేటింగ్..?

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, బాహటంగానే తిరుగుతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలను మృణాల్ ఠాకూర్ ఖండించింది.

తాను ఏ క్రికెటర్‌తోనూ, అసలు ఏ వ్యక్తితోనూ రిలేషన్‌లో లేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో తన తల్లితో నవ్వుతూ కనిపించిన మృణాల్ ఠాకూర్..'ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల నాకు ఉచిత పీఆర్‌ జరగుతుంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం.'అని క్యాప్షన్‌గా పేర్కొంది. శ్రేయస్ అయ్యర్, రిలేషన్‌షిప్ రూమర్స్ గురించి ప్రస్తావించకపోయినా.. వాటి గురించే ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Mrunal Thakur Finally Breaks Silence on Dating Rumours with Shreyas Iyer

తమిళ హీరో ధనుష్‌తో కూడా మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాము మంచి మిత్రులమని మృణాల్ కొట్టిపారేసింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ అతను తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్లీహంలో చీలిక రావడంతో ఐసీయూ తరలించి అయ్యర్‌కు చికిత్స అందించారు. ప్రాణపాయ పరిస్థితుల నుంచి బయటపడిన అయ్యర్.. ప్రస్తుతం ఈ విశ్రాంతి సమయాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టనుంది. దాంతోనే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

Mrunal Thakur Finally Breaks Silence on Dating Rumours with Shreyas Iyer

శ్రేయస్ అయ్యర్‌తో యుజ్వేంద్ర చాహల్ మాజీ సతీమణి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ సీక్రెట్‌ ఎఫైర్ నడిపించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చాహల్ లేకుండా ఈ ఇద్దరూ పలు పార్టీలకు హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. వివాహేతర సంబంధం కొనసాగించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను ధనశ్రీ వర్మ కొట్టిపారేసింది. అయ్యర్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని స్పష్టం చేసింది.

Story first published: Monday, December 1, 2025, 17:43 [IST]
Other articles published on Dec 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+