ఐపీఎల్ గెలిచిన 3 రోజులకే ఆర్‌సీబీ కెప్టెన్‌కు ఘోర పరాజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని విజేతగా నిలబెట్టిన ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2026 సీజన్ టైటిల్ అందుకున్న మూడు రోజులకే కెప్టెన్‌గా అతనికి ఘోర పరాజయం ఎదురైంది. ప్రస్తుతం రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. గ్వాలియర్ చీతాస్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
అయితే బుధవారం ఇండోర్ వేదికగా ఉజ్జయిన్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో గ్వాలియర్ చీతాస్ 92 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం బూమారాంగ్ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఉజ్జయిన్ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. మాధవ్ తివారీ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం గ్వాలియర్ చీతాస్ దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 501 పరుగులు చేసిన పాటిదార్.. ఈ మ్యాచ్‌లో ఐదో బ్యాటర్‌గా వచ్చి, 8 బంతుల్లో ఒక ఫోర్‌తో సహా కేవలం 11 పరుగులే చేసి వెనుదిరిగాడు. అతనితో పాటు ఆర్‌సీబీకే చెందిన మరో ప్లేయర్ మంగేష్ యాదవ్ కూడా 2 పరుగులకే ఔటయ్యాడు.
ఉజ్జయిన్ ఫాల్కన్స్ బౌలర్లలో ఆయుష్ మంకర్ మూడు వికెట్లతో రజత్ పాటిదార్ టీమ్ పతనాన్ని శాసించాడు. గ్వాలియర్ చీతాస్ 129 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన నేపథ్యంలో రజత్ పాటిదార్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్.. రజత్ పాటిదార్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని, టీ20లతో పాటు వన్డేల్లో ఆడించాలని సూచించాడు. వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచినా.. రజత్ పాటిదార్ గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడటం లేదని, అతనికి తగిన గుర్తింపు రావడం లేదన్నాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడబోయే అప్‌కమింగ్ టీ20 సిరీస్‌లకు రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎమ్‌పీఎల్ గ్వాలియర్ చీతాస్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం భోపాల్ లెపర్డ్స్‌తో ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications