Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కాకతాళీయమా..? ఐసీసీ ప్రీ ప్లానా? సెమీ ఫైనల్ టీమ్స్‌పై ఫ్యాన్స్ డౌట్స్!

Mother of coincidence: Fans trolls ICC after India, Pakistan and England enters T20 World Cup 2022 Semi Final

హైదరాబాద్: కాదేది కవితకు అనర్హం అన్నట్లు.. కాదేది ట్రోలింగ్ అనర్హం అన్నట్లు నెటిజన్లు రెచ్చిపోతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో సెమీ ఫైనల్ చేరిన జట్లపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఓ ఫొటోను ఆధారం చేసుకొని కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఐసీసీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక మెగా టోర్నీలో గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్ చేరగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్‌లు వచ్చాయి. చివరి వరకు సెమీస్ రేసులోనే లేని పాకిస్థాన్.. నెదర్లాండ్స్ సంచలన విజయంతో నాకౌట్ బెర్త్ అందుకుంది. అయితే ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్‌ల ఫొటోషూట్‌కు సెమీస్ బెర్త్‌లు దక్కించుకున్న జట్లకు లింక్ ఉండటంతో హాట్ టాపిక్ అయ్యింది.


ఈ ఫొటో షూట్‌లోని ఓ ఫొటోలో ఆరోన్ ఫించ్ సెల్ఫీ తీయగా.. అందులో అందరూ కెప్టెన్లు ఫోజిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందువరుసలో ఉండగా నెదర్లాండ్స్, పాకిస్థాన్, న్యూజిలాడ్, ఇంగ్లండ్ కెప్టెన్లు వెనుకలో ఉన్నారు. అయితే ఈ ఫొటోలోని బ్యాంక్ గ్రౌండ్‌లో ఓ పోస్టర్ ఉండగా.. అందులో మెగాటోర్నీలో పాల్గొనే అన్నిదేశాలు జెండాల చిహ్నాలు ఉన్నాయి.

అయితే కాకతాళీయమో ఏమో కానీ.. సెమీస్‌లో తలపడే జట్ల జెండాల చిహ్నాలు పక్కపక్కనే ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో తలపడే న్యూజిలాండ్ పాకిస్థాన్ చిహ్నాలతో పాటు రెండో సెమీ ఫైనల్లో తలపడే భారత్- ఇంగ్లండ్ జెండాల గుర్తులు పక్కనే ఉన్నాయి. దాంతో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకతాళీయమా? లేక టోర్నీ రిజల్ట్‌ను ముందే ప్లాన్ చేశారా? అని ఐసీసీని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Monday, November 7, 2022, 20:51 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+