Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముస్తాబైన మొతేరా.. 11 సెంటర్‌ పిచ్‌లు, ఎల్‌ఈడీ బుగ్గలు! భారీ వర్షం వచ్చినా మ్యాచ్ రద్దవ్వదు!

Motera Stadium to have 4 dressing rooms, LED lights for better visibility in day-night Test
New Motera Stadium Big In Every Sense: 11 Centre Pitches, LED Floodlights | Oneindia Telugu

అహ్మదాబాద్‌: పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా టెస్ట్‌లకు (డే/నైట్‌ టెస్టు) మొతేరాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియం ముస్తాబైంది. ప్రపంచంలోనే అత్యధికంగా 1.10 లక్షలు సీటింగ్‌ సామర్థ్యం గల స్టేడియంగా రికార్డులకెక్కిన మొతేరాలో ఎక్కడా లేని విధంగా అధునాతన వసతులు ఉన్నాయి. మూడో టెస్ట్ కోసం స్టేడియంలో నీడలు పడకుండా, పైనుంచి వచ్చే బంతిని సులభంగా గుర్తించేలా కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశామని గుజరాత్‌ క్రికెట్ ‌సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్‌ పటేల్‌ తెలిపారు. భారత్-ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 24న డే/నైట్‌ టెస్టు మొదలవనున్న విషయం తెలిసిందే .

11 సెంటర్‌ పిచ్‌లు

11 సెంటర్‌ పిచ్‌లు

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతేరాలో 11 సెంటర్‌ పిచ్‌లు ఉన్నాయని, మరెక్కడా ఇలాంటి వసతులు లేవని అనిల్‌ పటేల్‌ వెల్లడించారు. జిమ్‌లు కలిగిన నాలుగు డ్రస్సింగ్ రూమ్‌లు ఉన్నాయని తెలిపారు. డే/నైట్‌ టెస్టుకోసమే కొత్తగా ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశామని అనిల్‌ పటేల్‌ పేర్కొన్నారు. మొతెరాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియాన్ని కొన్నాళ్ల క్రితమే పూర్తిగా నవీనీకరించిన సంగతి తెలిసిందే. తొలుత ఇక్కడ ప్రధాని మోదీ, ట్రంప్‌ సభ నిర్వహించారు. మైదానాన్ని ట్రంప్‌ ఓపెనింగ్ చేశారు. ఇక ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ నాకౌట్‌ మ్యాచులు జరిగాయి.

ఎల్‌ఈడీ బుగ్గలు

ఎల్‌ఈడీ బుగ్గలు

'సాధన పిచ్‌లు, సెంటర్‌ పిచ్‌లను ఒకే రకమైన మట్టితో రూపొందించిన స్టేడియం ప్రపంచంలో ఇదొక్కటే. బంతి స్పష్టంగా కనిపించేందుకు, నీడలను పరిహరించేందుకు మాస్ట్‌ లైట్ల బదులు స్టేడియం పైకప్పు చుట్టూ ఎల్‌ఈడీ బుగ్గలు ఏర్పాటు చేశాం. ఇక్కడి అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థతో భారీ వర్షం వచ్చినా నిమిషాల వ్యవధిలో మైదానం సిద్ధమవుతుంది. పచ్చిక కింద పొరగా ఇసుకను వాడాం. దాంతో పాటు అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థతో చాలా వేగంగా వరద నీరు బయటకు వెళ్లిపోతుంది. 8 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఇబ్బంది లేదు. మ్యాచులు రద్దయ్యే పరిస్థితి ఉండదు' అని పటేల్ చెప్పారు.

63 ఎకరాల్లో

63 ఎకరాల్లో

63 ఎకరాల్లో నిర్మించిన మొతెరా స్టేడియంలో బౌలింగ్‌ యంత్రాలతో కూడిన 6 ఇండోర్‌ పిచ్‌లు ఉన్నాయి. చిన్న పెవిలియన్‌ గల రెండు ఔట్‌డోర్‌ పిచ్‌లు, రెండు ప్రాక్టీస్‌ పిచ్‌లు ఉన్నాయి. ఇక స్టేడియం క్లబ్‌హౌజ్‌లో 50 డీలక్స్‌ రూమ్‌లు, ఐదు సూట్‌లు ఉన్నాయి. ఇక మూడో టెస్ట్‌ వీక్షణకు 55 వేల మందిని ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఇక్కడ ఐపీఎల్ 2021 మ్యాచులు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్ టిక్కెట్లు అన్ని అమ్ముడుపోయాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు.

చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు జట్టు

చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు జట్టు

ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌బోయే చివ‌రి రెండు టెస్ట్‌ల‌కు బీసీసీఐ టీమ్‌ను ప్ర‌క‌టించింది. తొలి టెస్టు ఆడిన షాబాజ్ న‌దీమ్‌ను విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడేందుకు నేష‌న‌ల్ టీమ్ నుంచి బోర్డు రిలీజ్ చేసింది. పేసర్ ఉమేష్ యాద‌వ్ కూడా అహ్మ‌దాబాద్‌లో టీమ్‌తో చేర‌తాడ‌ని చెప్పింది. మొత్తం 17 మందితో కూడిన టీమ్‌ను ప్ర‌క‌టించింది.

జట్టు: కోహ్లీ, రోహిత్‌, మ‌యాంక్‌, శుభ్‌మ‌న్‌, పుజారా, ర‌హానే, రాహుల్‌, హార్దిక్ పాండ్యా, పంత్‌, అశ్విన్‌, సాహా, కుల్‌దీప్‌, అక్ష‌ర్, సుంద‌ర్‌, ఇషాంత్, బుమ్రా, సిరాజ్‌.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. స్పెయిన్‌ బుల్‌కు సిట్సిపాస్‌ షాక్!!

Story first published: Thursday, February 18, 2021, 8:29 [IST]
Other articles published on Feb 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+