Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

63 ఎకరాల విస్తీర్ణం..రూ.700 కోట్లు వ్యయం: ప‌్ర‌పంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం: ఎక్క‌డో కాదు..!

World's Largest Cricket Stadium Getting Built In Ahmedabad || Oneindia Telugu
Motera stadium in Ahmedabad to accommodate over 1 lakh spectators after renovation

అహ్మ‌దాబాద్‌: ప్ర‌పంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం రెడీ అవుతోంది. ఈ స్టేడియం విస్తీర్ణం అయిదో, ప‌దో కాదు.. ఏకంగా 63 ఎక‌రాలు. ఇంత పెద్ద స్థ‌లంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్థాయి విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న‌ క్రికెట్ స్టేడియం మ‌రెక్క‌డా లేదు. గుజ‌రాత్‌ అహ్మ‌దాబాద్ శివార్ల‌లోని మొతెరాలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మొతెరాలో ఇప్ప‌టికే ఓ స్టేడియం అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే. దీన్ని తొల‌గించి, అదే స్థానంలో కొత్త స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. మ‌రింత విస్త‌రిస్తున్నారు.

 700 కోట్ల రూపాయ‌ల వ్య‌యం

700 కోట్ల రూపాయ‌ల వ్య‌యం

పాపుల‌స్ సంస్థ ఈ స్టేడియం నిర్మాణాన్ని చేప‌ట్టింది. నిర్మాణానికి 700 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్నారు. స్టేడియం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌చ్చేట‌ప్ప‌టికి..నిర్మాణ వ్య‌యం మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చును గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ భ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంది. దీని సీట్ల సామ‌ర్థ్యం ల‌క్ష వ‌ర‌కు ఉంటోంది. మొతెరా స్టేడియం అందుబాటులోకి వ‌స్తే.. మెల్‌బోర్న్ రికార్డును అధిగ‌మిస్తుంది.

బౌల‌ర్.. లేబ‌ర్‌లాంటోడు: బౌలింగ్ చేయాల‌ని ఎవ‌రూ కోరుకోరు

అక్ష‌రాలా ల‌క్ష‌..

అక్ష‌రాలా ల‌క్ష‌..

కొత్త‌గా రూపుదిద్దుకుంటున్న మొతెరా స్టేడియంలో సీట్ల సామ‌ర్థ్యం ల‌క్ష‌. ఒకేసారి ల‌క్ష‌మంది ప్రేక్ష‌కులు క్రికెట్ మ్యాచ్‌ల‌ను తిల‌కించ‌డానికి అవ‌కాశం ఉంది. ఇదివ‌రకు మొతేరా స్టేడియం సీట్ల సామ‌ర్థ్యం 49 వేలు. విస్త‌రించిన త‌రువాత సీట్ల సంఖ్య‌ను ల‌క్ష‌కు చేరుతుంది. ల‌క్ష‌మందికి స్టేడియానికి చేరుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ పూర్తి చేస్తోంది. అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల స‌హ‌కారంతో రోడ్ల విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టింది. రోడ్ల విస్త‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యం, న‌ష్ట ప‌రిహారం చెల్లింపుల‌ను కూడా గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌నే భ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

15 వేల వాహ‌నాల పార్కింగ్‌..

15 వేల వాహ‌నాల పార్కింగ్‌..

మ్యాచ్‌ల‌ను తిల‌కించ‌డానికి ల‌క్ష‌మంది ఒకేసారి స్టేడియానికి త‌ర‌లి రావ‌డం అంటూ జ‌రిగితే పార్కింగ్ స‌మ‌స్య త‌లెత్తుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహ‌నాల పార్కింగ్ స్థ‌లం కోసం పాతిక ఎక‌రాల‌ను కేటాయించిన‌ట్లు చెబుతున్నారు. ఒకేసారి 15 వేల వాహ‌నాల‌ను ఇక్క‌డ నిలిపి ఉంచే అవ‌కాశాలను క‌ల్పిస్తోంది గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్. మూడు వేలకు పైగా కార్లు, 10 వేలకు పైగా ద్విచ‌క్ర వాహ‌నాల‌ను పార్క్ చేయ‌డానికి వీలుగా పార్కింగ్ స్థ‌లాన్ని తీర్చిదిద్దుతున్నారు.

 76 కార్పొరేట్ బాక్సులు

76 కార్పొరేట్ బాక్సులు

కొత్త‌గా రూపుదిద్దుకుంటున్న మొతెరా స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్సుల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్య‌లో కార్పొరేట్ బాక్సులు ఉన్న స్టేడియం ప్ర‌పంచంలో ఎక్క‌డా లేక‌పోవ‌డం గ‌మనార్హం. మ్యాచ్‌ల‌ను తిల‌కించ‌డానికి వ‌చ్చే కార్పొరేట్ సంస్థ‌ల య‌జ‌మానులు, ఆయా సంస్థ‌ల్లో ప‌నిచేసే ఉద్యోగుల కోసం ప్ర‌త్యేకంగా ఛార్జీల‌ను వ‌సూలు చేసి, ఈ బాక్సుల‌ను అప్ప‌గిస్తారు. ఈ రూపంలో భారీగా ఛార్జీల‌ను వ‌సూలు చేసే అవకాశం గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్‌కు ఉంది.

Story first published: Monday, June 24, 2019, 14:24 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+