Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌల‌ర్.. లేబ‌ర్‌లాంటోడు: బౌలింగ్ చేయాల‌ని ఎవ‌రూ కోరుకోరు

Ravichandran Ashwin Says 'Bowlers Like Labour Class, Batsmen Given Business Class Status’
Nobody wants to be a bowler, because it’s labour class: Ravichandran Ashwin

చెన్నై: టీమిండియా క్రికెట‌ర్‌, ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్రన్ అశ్విన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. త‌న కేరీర్‌లో టీమిండియాకు వ‌న్డే, టెస్ట్ మ్యాచుల్లో అనేక విజ‌యాల‌ను అందించిన ఈ త‌మిళ‌నాడు బౌల‌ర్ కొత్త‌గా వివాదాల్లో చిక్కుకున్నారు. బౌల‌ర్ అనే వాడు కూలీ (లేబర్) వంటి వాడ‌ని వ్యాఖ్యానించారు. బౌల‌ర్‌గా అవ‌త‌రించాల‌ని ఏ క్రికెట‌ర్ కూడా కోరుకోడ‌ని చెప్పారు. ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే శ‌క్తి, సామ‌ర్థ్యాలు ఒక్క బౌల‌ర్‌కే ఉంటాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

బ్యాట్స్‌మెన్ కావాల‌నుకున్నా..

బ్యాట్స్‌మెన్ కావాల‌నుకున్నా..

బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియ‌న్స్ పేరుతో యూట్యూబ్‌లో ప్ర‌సార‌మైన ఓ టాక్‌షోలో అశ్విన్ మాట్లాడారు. త‌న కేరీర్‌కు సంబంధించిన కొన్ని కీల‌క అంశాల‌ను ఆయ‌న వెలుగులోకి తీసుకొచ్చారు. తాను మొద‌ట బ్యాట్స్‌మెన్‌గా రాణించాల‌ని భావించిన‌ట్లు చెప్పారు. క్ర‌మంగా బౌల‌ర్‌గా అవత‌రించాన‌ని చెప్పుకొచ్చారు. ఓ జ‌ట్టు త‌ర‌ఫున అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ల్లో బ్యాటింగ్ చేయ‌డం అనేది బిజినెస్ క్లాస్ లేదా ఫ‌స్ట్‌క్లాస్‌తో స‌మాన‌మైన‌ది. అదే బౌలింగ్ లేబ‌ర్ క్లాస్‌తో స‌మానం. అందుకే- బౌలింగ్ చేయాల‌ని, బౌల‌ర్‌గా త‌యారు కావాల‌ని ఎవ‌రూ కోరుకోరు.. అని అశ్విన్ అభిప్రాయ‌ప‌డ్డారు. తాను బౌలర్‌గా రాణిస్తున్న స‌మ‌యంలో- ఈ విష‌యం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని అన్నారు.

పోరాట స్ఫూర్తిని నింపే శ‌క్తి బౌల‌ర్‌కే..

పోరాట స్ఫూర్తిని నింపే శ‌క్తి బౌల‌ర్‌కే..

ప్రేక్ష‌కుల్లో పోరాట స్ఫూర్తిని నింపే అవ‌కాశం మాత్రం ఒక్క బౌల‌ర్‌కే ద‌క్కుతుంద‌ని చెప్పారు. ఎలాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లోనైనా రాణించి, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించే సామ‌ర్థ్యం బౌల‌ర్‌కు ఉంటుంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు, ప్రేక్షకులు ఓ బ్యాట్స్‌మెన్‌ను ఎంత‌గా ఆరాధిస్తారో అదే త‌ర‌హా అభిమానాన్ని బౌల‌ర్లపైనా చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. బౌల‌ర్‌ను బౌల‌ర్‌గా కాకుండా ఓ పోరాట యోధుడిగా చూడాల‌ని కోరారు. స్పిన్న‌ర్‌గా తాను కేరీర్ ఆరంభించిన తొలి రోజుల్లో అనిల్ కుంబ్లే నుంచి చాలా మెళ‌కువ‌ల‌ను నేర్చుకున్నాన‌ని అన్నారు. టీమిండియాలో బౌల‌ర్‌గా రాణించ‌గ‌లిగితే.. త‌న భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందనే విష‌యాన్ని అనిల్ కుంబ్లే ద‌శాబ్దం కింద‌టే వెల్ల‌డించార‌ని అన్నారు.

టెస్టుల‌కే ప‌రిమిత‌మైన అశ్విన్‌..

టెస్టుల‌కే ప‌రిమిత‌మైన అశ్విన్‌..

ఇండియ‌న ప్రీమియర్ లీగ్ టోర్న‌మెంట్ల ద్వారా ర‌విచంద్న్ అశ్విన్ వెలుగులోకి వ‌చ్చారు. మొద‌ట్లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌ర‌ఫున ఆడిన ఆయ‌న బౌలింగ్‌కు దేశం ఆరాధించింది. అశ్విన్ విసిరే బంతులు ఓ ప‌ట్టాన బ్యాట్స్‌మెన్‌కు కొరుకుడు ప‌డ‌వు. అందుకే- అతి త‌క్కువ కాలంలో టీమిండియాలో కీల‌క బౌల‌ర్‌గా మారిపోయాడు. ఓ ద‌శ‌లో బౌలింగ్ విభాగానికి నేతృత్వం వ‌హించాడు. 2010లో జింబాబ్వేతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ సంద‌ర్భంగా అరంగేట్రం చేశారు అశ్విన్‌. క్ర‌మంగా అన్ని ఫార్మ‌ట్ల‌లోనూ రాణించాడు. ప్ర‌స్తుతం వ‌న్డేల్లో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. టెస్ట్ క్రికెట్‌లో కొన‌సాగుతున్నారు. అన్ని ఫార్మ‌ట్ల‌లో క‌లిపి 550 వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన మైలురాయిని అందుకున్నాడు అశ్విన్‌.

Story first published: Monday, June 24, 2019, 13:00 [IST]
Other articles published on Jun 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+