Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ జాబితాలో ధోనీ కన్నా ముందున్న పవన్ కల్యాణ్!

న్యూఢిల్లీ: ట్విటర్ వేదికగా జూన్ నెలలో ఎక్కువ చర్చించుకున్న భారతీయుల ఖాతాల్లో టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్‌ బాబులు టాప్-10లో నిలిచారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నా ముందు పవన్ కల్యాణ్ ఉండటం విశేషం. ఈ జాబితాలో భారత క్రికెటర్లలో ధోనీతో పాటు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉండగా.. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాథ్ రెండో స్థానంలో నిలిచారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలవగా.. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నాలుగో స్థానంలో.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఐదో స్థానంలో నిలిచారు.

MS Dhoni Pawan Kalyan

ఆరో స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉండగా.. ఏడో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్, 8వ స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, 9వ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ, 10వ స్థానంలో మహేష్ బాబులు ఉన్నారు. ఈ నెలలో ధోనీ ఒక్క ట్వీట్ చేయకపోయినా అతను టాప్-10లో ఉండటం విశేషం. పవన్ కల్యాణ్ ధోనీ కన్నా ముందుండటంపై అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ట్విటర్ వేదికగా భారత్‌లో ట్రెండ్ అయిన టాప్-10 హ్యాష్ ట్యాగ్స్‌లో ఐపీఎల్ 2023 అగ్రస్థానంలో నిలవగా.. ధోనీ ట్యాగ్ రెండో స్థానంలో నిలిచింది. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ట్యాగ్ మూడో స్థానంలో.. చెన్నై సూపర్ కింగ్స్ ట్యాగ్ లైన్ విజిల్ పొడు నాలుగో స్థానంలో నిలిచింది.

విరాట్ కోహ్లీ, లియో, టీమిండియా, డబ్ల్యూటీసీ ఫైనల, పఠాన్, మండే మోటీవేషన్ అనే ట్యాగ్స్ వరుసగా టాప్-10లో నిలిచాయి. ఐపీఎల్ మార్చి 31 నుంచి వారం నుంచి మే 29 వరకు జరగ్గా.. చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతోనే ఐపీఎల్ 2023, మహేంద్ర సింగ్ ధోనీ, విజిల్ పొడు ట్యాగ్స్ టాప్-5లో వరుసగా నిలిచాయి.

జూన్ 12 నుంచి 11 వరకు డబ్యూటీసీ ఫైనల్ జరగ్గా.. ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కోహ్లీ, టీమిండియా, డబ్ల్యూటీసీ ఫైనల్ హ్యాష్ టాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

Story first published: Monday, July 24, 2023, 21:23 [IST]
Other articles published on Jul 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+