టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ బ్రాడ్.. ఆ తర్వాత దూబేనే!!

హైదరాబాద్: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఎవరంటే సగటు క్రీడాభిమానులంతా.. యువరాజ్ సింగ్ అని తడబడకుండా చెప్తారు. అదే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ ఎవరో చెప్పమంటే కాస్త తడబడినా.. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అని చెప్పేస్తారు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జాబితా ఓ సారి పరిశీలిస్తే...

బ్రాడ్@1
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ స్టువర్ట్ బ్రాడ్. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్‌లో మొత్తం ఆరు సిక్సులు బాదడంతో.. ఏకంగా 36 పరుగులు వచ్చాయి. అలా టీ20 క్రికెట్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. నాటి మ్యాచ్‌లో యువరాజ్ కొట్టిన సిక్సులు భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. బహుశా బ్రాడ్‌ను మరే బౌలర్ దాటే అవకాశం ఉండదేమో!! ఒకవేళ నోబాల్స్ వేస్తే తప్ప.

బ్రాడ్ తర్వాత దూబే
స్టువర్ట్ బ్రాడ్ తర్వాత టీ20 క్రికెట్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ శివమ్ దూబే. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో దూబే ఒక ఓవర్లో ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో కివీస్ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ విజృంభించి ఆడడంతో 34 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున ఏ ఫార్మాట్లో అయినా ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు.

పార్నెల్.. 32 పరుగులు:
ఒకే ఓవర్‌లో 32 పరుగులు ఇచ్చిన జాబితాలో నలుగురు బౌలర్లు ఉన్నారు. వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), ఇజాతుల్లా దవ్లట్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్), స్టువర్ట్ బిన్నీ (ఇండియా), మాక్స్ ఓ'డౌడ్ (నెదర్లాండ్స్)లు ఉన్నారు. 31 పరుగులను బంగ్లాదేశ్ పేసర్ మహమ్మద్ సైఫుద్దీన్ మాత్రమే సమర్పించుకున్నాడు. ఇక 30 పరుగులు ఇచ్చిన జాబితాలో డారిల్ టఫీ (న్యూజిలాండ్), బిలావాల్ భట్టి (పాకిస్తాన్), రాబ్ టేలర్ (స్కాట్లాండ్), హమీద్ షా (డెన్మార్క్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు.
ఐపీఎల్ ఆతిథ్యంపై బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు: ఈసీబీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications