IPL 2022: వికెట్ విత్ మెయిడిన్ ఓవర్.. భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత!

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భువీ.. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్ వేసిన భువీ.. ఓ వికెట్‌తో పాటు ఒక్క పరుగు ఇవ్వకుండా మెయిడిన్ చేసి సన్‌రైజర్స్ విజయానికి బాటలు వేసాడు. అరంగేట్ర ప్లేయర్ సంజయ్ యాదవ్‌ను క్యాచ్ ఔట్ చేసిన భువీ.. యార్కర్లతోనే జస్‌ప్రీత్ బుమ్రాను పరుగులు చేయకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సూపర్ ఓవర్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

రెండో బౌలర్‌గా..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు భువనేశ్వర్ కుమార్ 11 మెయిడిన్ ఓవర్లు వేసాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ 14 ఓవర్లతో టాప్‌లో ఉన్నాడు. 119 మ్యాచ్‌ల్లో ప్రవీణ్ కుమార్ ఈ ఘనతను అందుకోగా.. 145 మ్యాచ్‌ల్లో భువీ ఈ ఫీట్ సాధించాడు. 10 మెయిడిన్ ఓవర్లతో ఇర్ఫాన్ మూడో స్థానంలో ఉండగా.. లసిత్ మలింగా(8), జస్‌ప్రీత్ బుమ్రా(8) టాప్-5లో కొనసాగుతున్నారు.

కేన్ మామ ఫిదా..
ఇక భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌కు సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ టోర్నీలో భువీ టాప్ డెత్ బౌలరని కొనియాడిన కేన్ మామ.. ముంబైతో అతను వేసిన వికెట్ విత్ మెయిడిన్ ఓవర్ అద్భుతమన్నాడు. ఇక సన్‌రైజర్స్ అభిమానులు సైతం భువీ మెయిడిన్ ఓవర్‌ను కొనియాడుతున్నారు. బ్యాటింగ్ ఫేవర్‌గా ఉండే టీ20 క్రికెట్‌లో మెయిడిన్ చేయడం ఆశామాషి వ్యవహారం కాదని కామెంట్ చేస్తున్నారు.

చెలరేగిన త్రిపాఠి...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి(44 బంతుల్లో 3సిక్స్‌లు, 9 ఫోర్లతో 76) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నికోలస్ పూరన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) ధాటిగా ఆడారు. ముంబై బౌలర్లలో రమన్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48), ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 43), టీమ్ డేవిడ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) రాణించినా ఫలితం లేకపోయింది.
హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. సుందర్, భువీ చెరొక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications