Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: పాపం హర్షల్ పటేల్.. జడేజా దెబ్బకు చెత్త రికార్డు.. గంగలో కలిసిన పర్పుల్ క్యాప్ ఘనత!

 Highest Wicket Taker Harshal Patel Gives Away 37 Runs In One Over
IPL 2021 : Ravindra Jadeja ఊచకోత.. Harshal Patel చెత్త రికార్డ్ | CSK Vs RCB || Oneindia Telugu

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన హర్షల్ పటేల్ ఒక్క ఓవర్‌తో తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పోగొట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీసిన ఈ ఆర్‌సీబీ నయా మ్యాచ్ విన్నర్.. ఆఖరి ఓవర్‌లో మాత్రం తేలిపోయాడు. చెన్నై ఫించ్ హిట్టర్, విధ్వంసకర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధాటికి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును లిఖించుకున్నాడు.

అతని కన్నా ముందు పరమేశ్వరన్ క్రిస్ గేల్ ధాటికి 37 పరుగుల సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 36 రన్స్ పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది. ఆ తర్వాత హర్షల్ పటేల్ 5 సిక్స్‌లు, ఫోర్‌తో, డబుల్‌ నోబాల్‌తో జడేజాకు 37 రన్స్ ఇచ్చాడు. హర్షల్ తర్వాత రైనా ఒకే ఓవర్‌లో 32 పరుగులు పిండుకున్నాడు. అవానా బౌలింగ్ 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో రైనా ఈ ఘనతను అందుకున్నాడు.

హర్షల్ పటేల్ వేసిన ఓవర్‌లో ఫస్ట్ కట్టర్ బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి బౌలర్‌ను ఒత్తిడిలో పడేసిన జడేజా.. లోయర్ ఫుల్ టాస్‌గా వేసిన సెకండ్ బాల్‌ను మరో భారీ సిక్సర్‌గా మలిచాడు. వాస్తవానికి ఈ బంతిని యార్కర్ వేయబోయిన హర్ష దాన్ని పకడ్బందీగా వేయలేకపోయాడు. ఆ తర్వాత హైట్ నోబాల్ వేయగా.. డీప్ మిడ్ వికెట్‌ మీదుగా జడేజా మరో భారీ సిక్సర్ కొట్టాడు. అనంతరం ఫ్రీహిట్ బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా మరో సిక్స్ కొట్టి 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో బంతికి జడేజా ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను సిరాజ్ వదిలేయగా.. డబుల్ వచ్చింది. ఇక ఐదో బంతిని మిడ్ వికెట్ మీదుగా మరో భారీ సిక్సర్ కొట్టిన జడేజా ఆఖరి బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ తరలించి ఇన్నింగ్స్ ముంగించాడు. జడ్డూ పరుగుల సునామీకి ఫాఫ్ డూప్లెసిస్ (41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 50)క్లాస్ ఇన్నింగ్స్‌ తోడవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఇక ఈ సీజన్‌లో 15 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ ఉండటం గమనార్హం.

Story first published: Sunday, April 25, 2021, 18:18 [IST]
Other articles published on Apr 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+