యావత్ ప్రపంచం కొత్త ఏడాదికి( 2026) స్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో గత ఏడాది 2025లో నమోదైన వింత రికార్డులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా అత్యధిక పరుగులు, సెంచరీలు, సిక్సర్లకు సంబంధించిన రికార్డ్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. కానీ 2025లో వాటితో పాటు డకౌట్ల జాబితా కూడా హాట్ టాపిక్‌గా మారింది. మైదానంలోకి వచ్చి డకౌట్‌గా వెనుదిరిగి ఆటగాళ్ల జాబితాను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ జాబితాలో భారత ఆటగాళ్లు కూడా ఉండటం గమనార్హం.
2025లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా పాకిస్థాన్ ప్లేయర్ సైమ్ అయుబ్ నిలిచాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి ఏకంగా 8 సార్లు డకౌటై ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది అతను 37 ఇన్నింగ్స్‌లు ఆడి 817 పరుగులు చేశాడు. ఈ 37 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
అతని తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ రోస్టన్ ఛేజ్ 7 డకౌట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
6 డకౌట్లతో పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది మూడో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌కు చెందిన జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జోమల్ వారిక్‌లు ఆరేసి సార్లు డకౌటయ్యారు. భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 6 సార్లు డకౌటై.. ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు.

1.సైమ్ అయూబ్ (పాక్) 8 సార్లు
2.రోస్టన్ చేజ్ (వెస్ట్ ఇండీస్) 7 సార్లు
3.షహీన్ అఫ్రిది (పాక్) 6 సార్లు
4.జెడెన్ సీల్స్ (వెస్ట్ ఇండీస్) 6 సార్లు
5.షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (విండీస్) 6 సార్లు
6.జోమల్ వారికన్ (విండీస్) 6 సార్లు
7.జస్ప్రీత్ బుమ్రా (భారత్) 5 సార్లు
8. మహమ్మద్ సిరాజ్(భారత్) 5 సార్లు
భారత జట్టులో యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సిరాజ్ ఐదు సార్లు డకౌటయ్యాడు. అందర్నీ విస్మయపరిచే విషయం ఏంటంటే టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడు సార్లు డకౌటయ్యాడు. ఇది భారత అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్ నాలుగుసార్లు డకౌటయ్యాడు.