Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: అత్యధిక క్యాచ్‌ల రికార్డ్ ఎవరిదంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 8 రోజుల్లో ఈ క్యాష్‌ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)‌తో కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు భారత క్రికెట్ అభిమానులను ఈ క్యాష్ రిచ్ లీగ్ అలరించనుంది. గత 17 ఏళ్లుగా ధనాధన్ లీగ్‌ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎంతో మంది కుర్రాళ్లను అంతర్జాతీయ స్టార్లుగా తీర్చిదిద్దింది.

గత 17 సీజన్లలో కళ్లు చెదిరే క్యాచ్‌లు.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలను అభిమానులను ఆకట్టుకున్నాయి. ఎన్నో క్యాచ్‌లు మ్యాచ్‌ల ఫలితాలను శాసించాయి. అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు మ్యాచ్‌లను మలుపు తిప్పాయి. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న 15 మంది ఆటగాళ్ల‌పై ఓ లుక్కెద్దాం.

Most Catches in IPL History Who is the Leading Fielder from 2008 to IPL 2025
Photo Credit: PTI

క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నట్లు చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలు చేశారు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడి 114 క్యాచ్‌లు అందుకున్నాడు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆర్‌సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తర్వాత సురేశ్ రైనా 109 క్యాచ్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నాలుగేళ్ల క్రితమే అతను రిటైర్మెంట్ ప్రకటించినా.. రెండో స్థానంలోనే ఉన్నాడు. ముంబై ఇండియన్స్ దిగ్గజం కీరన్ పోలార్డ్ 189 ఐపీఎల్‌ మ్యాచ్‌లో 103 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా(240 మ్యాచ్‌ల్లో 103 క్యాచ్‌లు) రోహిత్ శర్మ (257 మ్యాచ్‌ల్లో 101) క్యాచ్‌లు అందుకున్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితా

విరాట్ కోహ్లీ (252 మ్యాచ్‌లు.. 114 క్యాచ్‌లు)

సురేశ్ రైనా(205 మ్యాచ్‌లు.. 109 క్యాచ్‌లు)

కీరన్ పోలార్డ్(189 మ్యాచ్‌లు.. 103 క్యాచ్‌లు)

రవీంద్ర జడేజా(189 మ్యాచ్‌లు.. 103 క్యాచ్‌లు)

రోహిత్ శర్మ(257 మ్యాచ్‌లు.. 101 క్యాచ్‌లు)

శిఖర్ ధావన్(222 మ్యాచ్‌లు.. 99 క్యాచ్‌లు)

ఏబీ డివిలియర్స్(184 మ్యాచ్‌లు.. 90 క్యాచ్‌లు)

డేవిడ్ వార్నర్(184 మ్యాచ్‌లు.. 90 క్యాచ్‌లు)

మనీష్ పాండే(171 మ్యాచ్‌లు.. 83 క్యాచ్‌లు)

ఫాఫ్ డుప్లెసిస్(145 మ్యాచ్‌లు.. 81 క్యాచ్‌లు)

డ్వేన్ బ్రావో(161 మ్యాచ్‌లు.. 80 క్యాచ్‌లు)

డేవిడ్ మిల్లర్(130 మ్యాచ్‌లు.. 75 క్యాచ్‌లు)

అక్షర్ పటేల్(150 మ్యాచ్‌లు.. 72 క్యాచ్‌లు)

అజింక్యా రహానే(185 మ్యాచ్‌లు.. 70 క్యాచ్‌లు)

హార్దిక్ పాండ్యా(137 మ్యాచ్‌లు.. 69 క్యాచ్‌లు)

Story first published: Friday, March 14, 2025, 13:20 [IST]
Other articles published on Mar 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+