Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sara Tendulkar: ఛీ.. ఛీ.. తమ్ముడితో దిగిన ఫొటో మార్ఫింగా!

Sara Tendulkar: సోషల్ మీడియాలో ఫేక్ రాయుళ్లు పేట్రేగిపోతున్నారు. లైక్స్, కామెంట్స్, వ్యూస్ కోసం బరి తెగిస్తున్నారు. ప్రముఖులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి హల్‌చల్ చేస్తున్నారు. ఇటీవలే సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మంధనాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో కలకలం సృష్టించగా.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను మరవకముందే టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ ఫొటోను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. తన తమ్ముడు అర్జున్ టెండూల్కర్‌తో సారా టెండూల్కర్ దిగిన ఫొటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. అర్జున్ టెండూల్కర్ స్థానంలో టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఉండేలా ఎడిట్ చేశారు.

Morphed picture of Sara Tendulkar hugging Shubhman Gill goes viral

మార్ఫింగ్‌తోనే సరిపెట్టకుండా ఈ ఫొటోను నెట్టింట షేర్ చేసి.. శుభ్‌మన్ గిల్‌ను ప్రేమిస్తున్నానని సారా టెండూల్కర్ ప్రకటించినట్లు ఓ ఫేక్ పోస్ట్‌ను వైరల్ చేశారు. అయితే ఇది ఫేక్ పోస్ట్ అనే విషయం క్షణాల్లో తేలిపోయింది. ఈ పోస్ట్‌పై సచిన్, శుభ్‌‌మన్ గిల్

అర్జున్ టెండూల్కర్ జన్మదినం(సెప్టెంబర్ 24) సందర్భంగా సారా టెండూల్కర్ తన తమ్ముడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. 'నా చిన్నారి తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు. మీ అక్క నీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ పోస్ట్‌లో తమ చిన్ననాటి ఫోటోను కూడా పంచుకుంది.

ఈ ఫొటోనే మార్ఫింగ్ చేశారనే విషయం స్పష్టమైంది. ఇక సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. టీమిండియా మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరవ్వడం.. శుభ్‌మన్ బ్యాటింగ్ చేసే సమయంలో టీవీ కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

అంతేకాకుండా జియో ప్లాజా ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ ఇద్దరూ కలుసుకోవడం కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సైతం శుభ్‌మన్ గిల్ జీవితంలో ఉన్న సారా తాను కాదని, మరొకరని తెలిపింది. దాంతో శుభ్‌మన్ గిల్, సారా ప్రేమాయణం నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ వార్తలపై ఇరు కుటుంబాలు మౌనంగా ఉండటం కూడా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నిజమేనని నమ్మేలా చేస్తోంది.

Story first published: Tuesday, November 7, 2023, 19:31 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+