Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పాక్ మాజీ కోచ్

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన రానుందని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది. టీమిండియా హెడ్ కోచ్ నియమితుడైన గౌతమ్ గంభీర్ .. మోర్నీ మోర్కెల్ పేరును సూచించడంతో.. బీసీసీఐ అతన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి అతను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. సహాయక సిబ్బంది నియామకం విషయంలో తనకు అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేసుకున్నాడు. కేకేఆర్‌కు గంభీర్ సారథిగా ఉన్న సమయంలో మోర్నీ మోర్కెల్ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఇద్దరూ కలిసి 2014 సీజన్‌లో టైటిల్ కూడా గెలిచారు. లక్నో సూపర్ జెయింట్స్‌కు గంభీర్ మెంటార్‌గా ఉన్న సమయంలోనూ మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు.

Morne Morkel appointed as Team India s bowling coach Reports

మోర్నీ మోర్కెల్‌కు అంతర్జాతీయ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలం పాటు మోర్కెల్ పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. పీఎస్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఇప్పటికే టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్‌తో పాటు నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ టెన్ డస్కాటే నియమితులయ్యారు.

గంభీర్.. మోర్నీ మోర్కెల్ పేరు సూచించడంతో ఈ ఒక్క నియమాకాన్ని పక్కనపెట్టారు. దాంతో ఎన్‌సీఏలో బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్న సాయిరాజ్ శ్రీలంక పర్యటనలో తాత్కలిక బౌలింగ్ కోచ్‌గా పనిచేసాడు. టీమిండియా బౌలింగ్ కోచ్‌ పదవి కోసం భారత మాజీ క్రికెటర్లు ఆర్ వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీలు పోటీపడినట్లు వార్తలు వచ్చాయి. కానీ గంభీర్ మోర్నీ మోర్కెల్‌ కావాలని పట్టుబట్టడంతో అతన్ని నియమించినట్లు తెలుస్తోంది.

శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నాడు. సూర్యకుమార్ సారథ్యంలోని టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం రోహిత్ సేన 0-2తో కోల్పోయింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత భారత్‌పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది.

Story first published: Wednesday, August 14, 2024, 16:55 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+