
భవితవ్యంపై ఆలోచించాలి..
‘టీమిండియా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అందుకు ఇదే సరైన సమయం. ఏదో ఒకరోజు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకక తప్పదు. అందుకే ప్రతిసారీ టీమిండియా అతనిపైనే ఆధారపడకూడదు. ఇతరులు బాధ్యత తీసుకోవాలి. విరాట్ కోహ్లీ లేకుండా భారత క్రికెట్ పరిస్థితి ఏంటో చూడాలి. ఆసీస్‌తో మిగిలిన మూడు టెస్టుల్లో ఈ సంగతి తెలుస్తుంది. కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మ వీడ్కోలు పలికాక ఎవరు స్టార్లు అవుతారో చూడాలి. శుభ్‌మన్‌కు ఇదో గొప్ప అవకాశం' అని పనెసర్ అన్నాడు.

యువకులకు మంచి అవకాశం..
‘సిరీస్‌లో ఎవరు గెలుస్తారన్నది నేను చూడటం లేదు. తర్వాత తరం గురించి ఆలోచిస్తున్నా. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ లేరని తెలుసు. అందుకే రెండో టెస్టులో యువకులకు అవకాశాలు ఇవ్వాలి. ఇది వారికి సువర్ణావకాశం. ఐపీఎల్‌లో యువకులు బాగా రాణించారు. కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శుభ్‌మన్ టీమిండియా భవిష్యత్త్ తారలు. వీరికి అవకాశాలిచ్చి భారత క్రికెట్ భవిష్యత్తేంటో తెలుసుకోవాలి. అన్నీ విరాట్ కోహ్లీ ఒక్కడే చేయలేడుగా' అని మాంటీ తెలిపాడు.

రిషభ్ పంత్‌ను తీసుకోవాలి..
ఇక భారత జట్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన రిషభ్ పంత్‌ను కాకుండా వృద్దిమాన్ సాహాను కీపర్‌గా కొనసాగించడం బుద్దితక్కువ పనని ఈ ఇంగ్లండ్ మాజీక్రికెటర్ అన్నాడు. తానే భారత కెప్టెన్ అయితే పంత్‌నే కీపర్‌గా కొనసాగించేవాడినని తెలిపాడు. ‘సాహా ఏమైనా స్పెషలిస్ట్ బ్యాట్స్‌మనా? ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే రిషభ్ పంతే సరైనవాడు.'అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ టెస్ట్‌ల్లో రాణించాలంటే.. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని పనేసర్ సూచించాడు. బ్యాటింగ్ నైపుణ్యం పరంగా రోహిత్ అసాధారణ ఆటగాడని, కానీ ఫిట్‌నెస్ దృష్టిసారిస్తే అతని కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుందన్నాడు.


Click it and Unblock the Notifications
