Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అంటే బ్రాండ్.. అతన్ని తప్పిస్తే బీసీసీఐకే కాదు ఐసీసీకి కోట్లలో నష్టం: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Monty Panesar says Money factor behind BCCIs decision to not drop Virat Kohli

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీ అంటే ఓ ఆటగాడి పేరు మాత్రమే కాదని, అతనో బ్రాండ్ అని తెలిపాడు. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రికెటరని కొనియాడాడు. ప్రస్తుతం కెరీర్‌లో దుర్బర దశను ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీని తప్పిస్తే బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు, ఐసీసీ కోట్లలో నష్టపోవాల్సి ఉంటుందని పనేసర్ హెచ్చరించాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కపిల్ దేవ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీని పక్కపెట్టాలని సూచిస్తున్నారు.

 తప్పిస్తే బీసీసీఐకి కోట్లలో నష్టం..

తప్పిస్తే బీసీసీఐకి కోట్లలో నష్టం..

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ గురించి ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ కోహ్లీని టీమ్‌లో నుంచి తీసేయడం అంత తేలికయ్యే పని కాదు. ఎందుకంటే అతను ఓ ప్లేయర్ మాత్రమే కాదు, ఓ బ్రాండ్... వరల్డ్‌లోనే మోస్ట్ మార్కెటబుల్ క్రికెటర్. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీకి మాత్రమే జనాల్లో అంతటి పాపులారిటీ ఉంది. విరాట్ కోహ్లీ టీవీ మీద కనిపిస్తే చాలు కాసుల పంట కురుస్తుంది. అందుకే విరాట్ కోహ్లీ తప్పిస్తే బీసీసీఐ.. కోట్లలో నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

బీసీసీఐకే కాదు ఇతర బోర్డులకూ..

బీసీసీఐకే కాదు ఇతర బోర్డులకూ..

విరాట్ కోహ్లీ క్రీజులో ఉండే విధానం ప్రతీ ఒక్కరినీ నచ్చుతుంది. అతను ప్రతీ మూమెంట్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లోనూ విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నారు. కేవలం భారత క్రికెట్ బోర్డు మాత్రమే కాదు మిగిలిన క్రికెట్ బోర్డులు కూడా విరాట్ కోహ్లీ పేరు చెప్పి చాలా సంపాదించుకున్నాయి. అతన్ని చూపించి స్పాన్సర్లను రాబట్టుకున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఆర్థికంగా క్రికెట్‌కు ఎంతో అవసరం.

ఇప్పుడు బీసీసీఐ చేయాల్సిందల్లా అతన్ని ఫామ్‌లోకి ఎలా తేవాలి? అని మాత్రమే.

కోహ్లీ వల్లే ఆర్‌సీబీకి క్రేజ్..

కోహ్లీ వల్లే ఆర్‌సీబీకి క్రేజ్..

ఎందుకంటే టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్‌ వస్తున్న టైమ్‌లో మరిన్ని డబ్బులు సంపాదించుకోవాలనే ఏ బోర్డు అయినా ఆలోచిస్తుంది. ఇప్పుడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపైనే ఎక్కువ భారం ఉంటుంది. రొనాల్డో, మాంచెస్టర్ యూనైటెడ్‌కు ఆడటం మొదలెట్టిన తర్వాత అందరూ ఫుట్‌బాల్ చూడటం మొదలెట్టారు. అలాగే ఆర్‌సీబీకి అంత క్రేజ్ రావడానికి విరాట్ కోహ్లీయే కారణం. విరాట్ కోహ్లీ బ్రాండ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే బీసీసీఐ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విరాట్‌ను పక్కనెబట్టాలనే ఆలోచన బీసీసీఐ చేస్తుందని మాత్రం నేను అనుకోను.' అని పనేసర్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్..

వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్..

విరాట్ కోహ్లీ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగియున్న తొలి క్రికెటర్, టాప్ -2 స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ. సంపాదనలోనూ కోహ్లీనే నెంబర్ వన్ క్రికెటర్. ఫుట్ బాల్ దిగ్గజం రొనాల్డో తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన క్రీడాకారుడు కోహ్లీ. కేవలం ప్రకటనల ద్వారానే అతను కోట్లలో సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రమోషన్ ట్వీట్‌కు కోట్లలో ఆర్జిస్తున్నాడు.

Story first published: Saturday, July 16, 2022, 20:10 [IST]
Other articles published on Jul 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+