Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Monty Panesar: టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలి

 Monty Panesar says India’s T20 captaincy should be given to Rohit Sharma

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ఓటమితో మరోసారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని కొందరు అభిమానులు, మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని, కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని కొందరంటే.. మరికొంత మంది ఫార్మాట్‌కు ఓ కెప్టెన్‌ను పెట్టాలని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. దాంతో మరోసారి రోహిత్-కోహ్లీ కెప్టెన్సీ చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది.

ఇక ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ సైతం కెప్టెన్సీ బాధ్యతలను ఆటగాళ్లకు పంచాలని అభిప్రాయపడ్డాడు. టీమిండియా టీ20 ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని సూచించాడు. అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా సత్తా చాటాడని తెలిపాడు. అంతేకాకుండా కెప్టెన్సీ కారణంగా విరాట్ కోహ్లీపై అనవసర ఒత్తిడి నెలకొంటుందని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇంగ్లండ్ జట్టులో కైల్ జెమీసన్ వంటి బౌలర్లు లేరని, టాపార్డర్ బ్యాటింగ్ కూడా బలహీనంగా ఉందన్నాడు. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టే హాట్ ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు.

'టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మకు ఇవ్వాలి. ముంబై ఇండియన్స్ తరఫున కెప్టెన్‌గా అతను సత్తా చాటాడు. కెప్టెన్సీ వల్ల విరాట్ కోహ్లీపై అనవసర ఒత్తిడి నెలకొంటుంది. ఇంగ్లండ్‌తో జరగనున్న అప్‌కమింగ్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఆటగాళ్లు విఫలమైనా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 గెలవకున్నా ఏం జరుగుతుందో మనందరికి తెలిసిందే. (విరాటే తప్పుకుంటాడు). అతనిపై అంత ఒత్తిడి ఉంది. ఇంగ్లండ్ జట్టు.. న్యూజిలాండ్ టీమ్ అంత బలమైనదైతే కాదు. ఆ జట్టులో కైల్ జెమీసన్ వంటి బౌలర్ లేడు. పైగా టాపార్డర్ బ్యాటింగ్ బలంగా కూడా లేదు . కాబట్టి ఈ సిరీస్‌లో భారత్ పై చేయి సాధించవచ్చు.'అని పనేసర్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఫార్మాట్‌కు ఓ కెప్టెన్ పద్దతిని ఫాలో అవుతుండగా.. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ మాత్రం మూడు ఫార్మాట్లు ఒకే కెప్టెన్‌ను కొనసాగిస్తుంది. భారత జట్టు కూడా టెస్ట్‌లకు రహానే, టీ20లకు రోహిత్, వన్డేలకు కోహ్లీని కెప్టెన్‌లుగా నియమించాలని, అప్పుడు విరాట్‌పై ఉన్న ఒత్తిడి తగ్గుతుందన్నాడు.

Story first published: Friday, June 25, 2021, 17:32 [IST]
Other articles published on Jun 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+