For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదృష్టంతోనే ఓటమి నుంచి ఇంగ్లండ్ గట్టెక్కింది: మాంటీ పనేసర్

భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ అదృష్టంతోనే ఓటమి తప్పించుకుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ అన్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో లక్కీగా ఇంగ్లండ్ గెలిచిందని, ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీని భారత్ 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరి వికెట్‌‌గా సిరాజ్ వెనుదిరగడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.

తాజాగా ఈ సిరీస్ ఫలితంపై మాట్లాడిన మాంటీ పనేసర్.. భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. అసాధారణ బ్యాటింగ్‌తో నాలుగో టెస్ట్‌ను భారత్ డ్రా చేసుకుంది. లార్డ్స్‌లో గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఔటవ్వడంతో లక్కీగా ఇంగ్లండ్ గెలిచింది.

Monty Panesar Says England were very lucky in Lord s Test against India

ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా ఆఖరి రోజు మేఘావృతమైన పరిస్థితుల మధ్య భారత బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ రోజు అన్నీ భారత్‌కు అనుకూలించింది. టీమిండియా ఆటతీరు చాలా మెరుగుపడింది. ఓవల్ విజయంతో ఈ సిరీస్ సమమైనా విజేత భారత్ అనే ఫీలింగ్ కలిగింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సిరీస్‌ను సమం చేసుకొని భారత జట్టు తమ బలాన్ని ప్రదర్శించింది. బుమ్రా లేకున్నా భారత్ విజయాలు సాధించడం ప్రారంభించింది. భవిష్యత్తులో సిరాజ్ చుట్టూ బౌలింగ్ యూనిట్'అని పనేసర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 8, 2025, 11:12 [IST]
Other articles published on Aug 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+