
టైటిల్ ఢిల్లీదే:
తాజాగా మాంటీ పనేసర్ WION సుభాయన్ చక్రవర్తితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2020 విజేత, ప్లే ఆఫ్ చేరే జట్ల వివరాలు తెలిపాడు. ఐపీఎల్ 2020 విజేతగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలుస్తుందని పనేసర్ జోస్యం చెప్పాడు. యువకులు, అనుభవజ్ఞులతో ఢిల్లీ జట్టు మంచి సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. యూఏఈ పరిస్థితులు ఇతర ఫ్రాంచైజీల కంటే ఢిల్లీ ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. మాంటీ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.

పంత్‌కు ఆరెంజ్ క్యాప్:
ఐపీఎల్ 13వ సీజన్ కోసం మాంటీ పనేసర్ తన ఫేవరేట్ నాలుగు జట్లను ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్ 2020లో తన ఫేవరేట్ జట్లుగా పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కప్ కొడుతుందని చెప్పాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈసారి పరుగుల వరద పారిస్తాడని జోస్యం చెప్పాడు. ఈసారి పంత్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుంటాడని ధీమా వ్యక్తం చేసాడు. ఇక హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పర్‌పుల్ క్యాప్ అందుకంటాడని పనేసర్ పేర్కొన్నాడు.

సచిన్ బోల్తా:
మాజీ స్ఫిన్నర్ మాంటీ పనేసర్ 2012-13 సీజన్‌లో భారత్‌పై సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సిరీస్‌లో పనేసర్ 17 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ పర్యటనలో లిటిల్‌మాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను పలుమార్లు ఔట్ చేశాడు. ముఖ్యంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో లిటిల్‌మాస్టర్‌ను ఔట్ చేసిన తీరు అద్భుతం. ఆ మ్యాచ్‌లో పనేసర్ ఓ వైవిధ్యమైన బంతితో సచిన్‌ను బోల్తాకొట్టించాడు.

ఎక్స్‌పర్ట్స్ ప్లే ఆఫ్ అంచనాలు:
గౌతమ్ గంభీర్: 1. ముంబై ఇండియన్స్ 2. సన్‌రైజర్స్ హైదరాబాద్ 3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4. ఢిల్లీ క్యాపిటల్స్/రాజస్థాన్ రాయల్స్
సంజయ్ మంజ్రేకర్ : 1. ముంబై ఇండియన్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్, 3. ఢిల్లీ క్యాపిటల్స్ 4. సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇయాన్ బిషప్: 1. ముంబై ఇండియన్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్, 3. ఢిల్లీ క్యాపిటల్స్ 4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
దీప్ దాస్ గుప్తా: 1. ముంబై ఇండియన్స్ 2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3. చెన్నై సూపర్ కింగ్స్, 4. కోల్‌కతా నైట్ రైడర్స్
టామ్ మూడీ: 1. ఢిల్లీ క్యాపిటల్స్ 2. ముంబై ఇండియన్స్ 3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4. సన్ రైజర్స్ హైదరాబాద్
అజిత్ అగార్కర్: 1. ముంబై ఇండియన్స్ 2. రాజస్థాన్ రాయల్స్ 3. కోల్‌కతా నైట్ రైడర్స్ 4. చెన్నై సూపర్ కింగ్స్
ఆకాష్ చోప్రా: 1. ఢిల్లీ క్యాపిటల్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్ 3. ముంబై ఇండియన్స్ 4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
IPL vs Karthika Deepam ఫైట్.. అభిమాని కోసం వంటలక్క ఏంచేసిందంటే!!


Click it and Unblock the Notifications












