Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL vs Karthika Deepam ఫైట్.. అభిమాని కోసం వంటలక్క ఏంచేసిందంటే!!

Karthika Deepam actress Premi Viswanath bought 32 inch TV for fan Shivacharan

హైదరాబాద్: సెప్టెంబర్ 19 నుంచి మెగా లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమయితే.. మైదానం నుంచి అభిమానులు ఇళ్లకు వెళ్లడానికి పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి 7 గంటల 30 నిమిషాలకే మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కావడం ఇప్పుడు ప్రతి తెలుగు ఇంట్లో ఓ సమస్యగా మారింది. ఎందుకంటే అదే సమయంలో తెలుగులో 'కార్తీకదీపం' సిరీస్ ప్రసారం కానుంది.

రేటింగ్‌లో టాప్:

తెలుగు రాష్ట్రాల్లో 'స్టార్ మా' చానెల్లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్‌కు ఎంత డిమాండ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత తెలుగు సీరియళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఈ సమయంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు టీవీలో వచ్చినా.. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో జరిగినా.. ఆడియో వేడుకలు, సినిమా ఈవెంట్లు లైవ్ టెలికాస్ట్ అయినా.. సింగిల్ హ్యాండ్‌తో వాటన్నింటినీ పక్కకు నెట్టి రేటింగ్‌లో టాప్ లేపుతోంది కార్తీకదీపం సీరియల్. బుల్లితెర బాహుబలిగా కోట్లాది మంది ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. కార్తీకదీపంతో ఓవరాల్‌గా స్టార్ మా ఛానల్ నంబర్ వన్ పొజీషన్‌లో కొనసాగుతోందంటే.. ఎంతలా ప్రభావం చూపుతుందో అర్ధం చేసుకోవచ్చు.

గంగూలీకి వినతి:

గంగూలీకి వినతి:

స్టార్ మా చానెల్లో ప్రతిరోజు రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతుంది. ఇదే సమయంలో ఐపీఎల్‌ 2020 మ్యాచ్‌లు కూడా మొదలవుతున్నాయి. దీంతో ఒకే టీవీ ఉన్న ఇంట్లో రిమోట్ కోసం గొడవలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్..‌ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఐపీఎల్‌ పాలక మండలి, స్టార్‌ మాకి ఓ ట్వీట్‌ చేశాడు. 'గంగూలీ సర్.. ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. 7.30కి మా ఇంట్లో కార్తీక దీపం సీరియల్ చూస్తారు. మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి' అంటూ శివ చరణ్ ట్వీట్లో పేర్కొన్నాడు.

32 అంగుళాల టీవీ గిఫ్ట్:

32 అంగుళాల టీవీ గిఫ్ట్:

శివ చరణ్ చేసిన విజ్ఞప్తి కార్తీకదీపం హీరోయిన్‌ ప్రీమి విశ్వనాథ్ (దీప)‌కు తెలిసింది. సీరియల్‌ను ఇంతలా అభిమానించేవారు ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చడం కుదరదని తెలుసుకున్న ప్రేమి విశ్వనాథ్‌.. శివ చరణ్ కుటుంబ సభ్యుల అభిమానానికి సంతోషించి తానే స్వయంగా 32 అంగుళాల టీవీని కొని పంపించారు. దీంతో శివ చరణ్ కుటుంబ సమస్య తీరింది. శివ చరణ్‌ కుటుంబ సభ్యులు ఒక టీవీలో కార్తీక దీపం.. మరొక టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడనున్నారు. శివ చరణ్ కుటుంబ సభ్యులు టీవీతో కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Story first published: Saturday, September 19, 2020, 16:48 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+