ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. వరల్డ్ బెస్ట్ క్రికెట్ లీగ్. ఆట, ఆదరణ, ఆదాయం ఎలా చూసుకున్న ఐపీఎల్‌కు సరితూగే ఫ్రాంచైజీ లీగ్ మరొకటి లేదు. అందుకే ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు పరితపిస్తారు. కనీసం ఒక్క సీజన్ అయినా ఆడాలనే కలలు కంటారు. అంతలా ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు క్రేజ్ ఉంది. డబ్బుకు డబ్బు.. ఆటకు ఆట.. గుర్తింపుకు గుర్తింపు దక్కే ఏకైక లీగ్ ఐపీఎల్. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లు అయ్యారు. ఎందరో స్టార్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో పత్తాలేకుండా పోయారు.
రెండున్నర నెలలు యావత్ క్రికెట్ ప్రపంచం ఐపీఎల్ మత్తులో మునిగి తేలుతోంది. రాత్రి 7 అయ్యిందంటే చిన్నా పెద్ద అందరూ మొబైల్స్ కో.. టీవీ స్క్రీన్స్ కో అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తున్నారు. అంతలా ఆదరణ పొందిన ఈ లీగ్‌ను కొందరు విదేశీ ఆటగాళ్లు ఒక టైంపాస్ పల్లి బఠాణి యవ్వారంలా చూస్తున్నారు. హాలిడే వేకేషన్‌లో ఫ్యామిలీతో ఐపీఎల్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయినా ఈ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల రూపాయాలను తగలేస్తున్నాయి.

గత 19 ఏళ్లలో కొందరు విదేశీ ఫ్లాప్ ఆటగాళ్లు మన ఫ్రాంచైజీల దగ్గర దోచుకున్న డబ్బులు చూస్తే మన దేశ ఆర్థిక నేరగాళ్లు ఎంతో నయం. అన్ని సీజన్లలో కలిపి గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఒక్కడే సంపాదించిన డబ్బు అక్షరాల రూ.145 కోట్లు. అతను ఆడింది మాత్రం సున్నా. ఐపీఎల్ 2014 మినహా అతను ఏ సీజన్‌లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రతీ ఏడాది భారత్‌కు వచ్చి టైంపాస్ చేసి వెళ్లి పోయాడు. అతని తీరుకు విసిగిపోయిన ఫ్రాంచైజీలు దూరం పెట్టేసాయి. మ్యాక్స్‌వెల్ టైంపాస్ వ్యవహారం గురించి గతంలోనే వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతన్ని కొనుగోలు చేయవద్దని ఫ్రాంచైజీలకు నెత్తి నోరు కొట్టుకొని మరి చెప్పాడు.
మ్యాక్స్‌వెల్ తర్వాత లియం లివింగ్ స్టోన్ రూ.60 కోట్లు, క్రిస్ మోరిస్ రూ.80 కోట్లు, బెన్ స్టోక్స్ 80 కోట్లు దోచుకున్నారు. వీరే కాకుండా ఎందరో ఆటగాళ్లు సీజన్ సీజన్‌కు వచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. ఏబీ డివిలియర్స్, సునీల్ నరైన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ప్రాణం పెట్టిన ఆడినా.. మిగతా ప్లేయర్లు మాత్రం టైంపాస్ చేసి డబ్బులు ఏసుకుపోయారు. మనీ వర్సెస్ పర్ఫామెన్స్ ఆధారంగా విదేశీ ఆటగాళ్లలో మోస్ట్ సక్సెఫుల్ ప్లేయర్ ఎవరా? అంటే ఏబీ డివిలియర్స్, రషీద్ ఖాన్ అని చెప్పవచ్చు.
1. ఏబీ డివిలియర్స్ రూ.100-105 కోట్లు
2. సునీల్ నరైన్- రూ. 135+ కోట్లు
3. ఆండ్రీ రస్సెల్-రూ.100+ కోట్లు
4. గ్లేన్ మ్యాక్స్‌వెల్- రూ. 145 కోట్లు
5. డేవిడ్ వార్నర్ రూ.100 కోట్లు
6. కీరన్ పోలార్డ్-రూ.95+ కోట్లు
7. లసిత్ మలింగా-రూ.48+ కోట్లు
8. బెన్ స్టోక్స్- రూ.75+ కోట్లు
9. క్రిస్ మోరీస్- రూ.80+ కోట్లు
10. రషీద్ ఖాన్- రూ.120+ కోట్లు