రూ.27 కోట్లకు రిషభ్ పంత్‌కు సంబంధం లేదు: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఆ జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అండగా నిలిచాడు. అతని ప్రైజ్ ట్యాగ్‌తో ఆటను పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రిషభ్ పంత్ 9 ఇన్నింగ్స్‌ల్లో 128.30 స్ట్రైక్‌రేట్‌తో 204 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గానూ అతను రాణించలేకపోతున్నాడు. దాంతో లక్నో 9 మ్యాచ్‌ల్లో 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ ధర రూ.27 కోట్లతో లక్నోలోకి వచ్చిన రిషభ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ ఐపీఎల్ 2025 సీజన్‌తో పాటు తాజా సీజన్‌లోనూ పంత్ తీవ్రంగా నిరాశపర్చాడు. అటు కెప్టెన్సీతో పాటు ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంత్ 14 మ్యాచ్‌ల్లో 260 పరుగులే చేశాడు.

ఈ క్రమంలోనే రిషభ్ పంత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. జస్టిన్ లాంగర్ మాత్రం రిషభ్ పంత్ తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని స్పష్టం చేశాడు. కెప్టెన్సీ అనేది చాలా కఠినమైదని, ఎంతో ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుందని లాంగర్ పేర్కొన్నాడు.
'నిజాయితీగా చెప్పాలంటే పంత్ ప్రదర్శనకు డబ్బుతో ఏ మాత్రం సంబంధం లేదని నా అభిప్రాయం. సారథ్యం అనేది ఒక కఠినమైన బాధ్యత. ఎంతో ఒత్తిడిని మోయాల్సి ఉంటుంది. ఆ విషయం పంత్‌కు బాగా తెలుసు. జట్టు కోసం అతను ఎంతో ఒత్తిడిని భరిస్తున్నాడు. మా అందరిలాగే 98 శాతం సమయం అతను చిరునవ్వుతోనే ఆ బాధ్యతను నిర్వర్తిస్తాడు. మిగిలిన 2 శాతం సమయం మాత్రం పరిస్థితి కాస్త కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ పంత్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ సీజన్ ఆరంభంలోనే జట్టుకు విజయాన్ని అందించే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను నవ్వుతూ తనదైన శైలిలో దూకుడుగా ఆడినప్పుడు మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ స్థాయి ప్రదర్శనకు అతను ఎంతో దూరంలో లేడు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. దీనిబట్టి పంత్ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం ఉంది.'అని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications