Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ సిరాజ్‌కు ఐసీసీ అవార్డ్!

టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌‌ను ఐసీసీ అవార్డ్ వరించింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేసినందుకు ఈ అవార్డ్ దక్కింది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఐదు ఆడిన మహమ్మద్ సిరాజ్ 23 వికెట్లతో సత్తా చాటాడు. అతని ప్రదర్శనతో ఈ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసుకుంది.

ముఖ్యంగా ఒవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో సిరీస్‌లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. హోరాహోరీగా సాగిన పోరులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌కు 6 పరుగుల తేడాతో విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఆగస్ట్ మంత్ అవార్డ్‌‌ సిరాజ్‌కు దక్కింది.

కెరీర్‌లో ఫస్ట్ టైమ్..

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రావడం సిరాజ్‌కు ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఈ ఘనతను అందుకున్న 9వ బ్యాటర్‌గా సిరాజ్‌ నిలిచాడు. అతని కన్నా ముందు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్‌ప్రీత్ బుమ్రా ఈ అవార్డ్ అందుకున్నారు. ఇందులో శుభ్‌మన్ గిల్ ఒక్కడే నాలుగు సార్లు ఈ అవార్డు అందుకోగా.. బుమ్రా, అయ్యర్ రెండేసి సార్లు స్వీకరించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 30 రోజుల్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డ్‌కు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి నెల ఐసీసీ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. భారత్ మినహా మరే జట్టు కూడా ఇన్ని అవార్డ్స్ గెలుచుకోలేదు. ఈ ఏడాది ఈ అవార్డ్ అందుకున్న నాలుగో భారత ఆటగాడు సిరాజ్. ఫిబ్రవరి, జూలైలో గిల్, మార్చిలో శ్రేయస్ అయ్యర్ ఈ అవార్డ్ స్వీకరించారు.

Mohammed Siraj s ICC Player of the Month Award for England Heroics Sets Unique World Record for India

నాకు దక్కిన గౌరవం..

ఈ అవార్డ్ అందుకోవడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం ప్రత్యేక గౌరవం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ మరిచిపోలేని సిరీస్. నేను ఆడిన అత్యంత ఉత్కంఠమైన సిరీస్‌ల్లో ఇది ఒకటి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. ప్రత్యర్థి గడ్డపై వారి టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్‌కు బౌలింగ్ చేయడం సవాల్ అయినప్పటికీ... నా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాను.

ఈ అవార్డ్ క్రెడిట్ నా సహచర ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్‌ది. వారి ప్రొత్సాహం, నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించాయి. నేను భారత జెర్సీ ధరించిన ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.'అని సిరాజ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, September 15, 2025, 17:23 [IST]
Other articles published on Sep 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+