Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: నిప్పులు చెరిగిన సిరాజ్.. 7 ఓవర్లలో 3 వికెట్లు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తన తొలి స్పెల్‌లోనే సిరాజ్ 3 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. దాంతో సిరాజ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురుస్తోంది. సిరాజ్ ధాటికి వెస్టిండీస్ 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, బుమ్రా చెరో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్ ఆరంభంలోనే తేజ్‌నారాయణ్ చందర్‌పాల్(0)‌ను సిరాజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే జాన్ కాంప్‌బెల్‌(8)‌ను జస్‌ప్రీత్ బుమ్రా కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్(13)‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆచితూచి ఆడిన అలిక్ అథనాసియస్(12)ను క్యాచ్ ఔట్‌గా వెనక్కిపంపాడు. అతను కొట్టిన షాట్ నేరుగా స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ చేతిలో పడింది.

Mohammed Siraj s Fiery Spell India Pacer Bags 3 Wickets In His 1st Spell Against West Indies

దాంతో వెస్టిండీస్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోస్టన్ ఛేజ్(22 బ్యాంటింగ్) షైహోప్(26) ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 48 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కుల్దీప్ యాదవ్ తన రెండో ఓవర్‌లోనే షైహోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు.

ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్.. అదే జోరును సొంతగడ్డపై కొనసాగిస్తున్నాడు. సొంతగడ్డపై సిరాజ్ రాణించలేడనే విమర్శలను తుడిచిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-2తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఖరి టెస్ట్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ పర్యటనలో అతను ఐదు టెస్ట్‌లు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్5 వికెట్ల ఘనతను అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సిరాజ్ వికెట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Story first published: Thursday, October 2, 2025, 12:00 [IST]
Other articles published on Oct 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+