
హైదరాబాద్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆ జట్టులోని ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ధన్యవాదాలు తెలిపాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు జట్టు ఆదివారం టోలిచౌకీలో ఉన్న మహమ్మద్ సిరాజ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సిరాజ్ ఇంటికి వెళ్లిన విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్, యజువేంద్ర చాహల్ హైదరాబాద్ వంటకాలైన బిర్యానీతో పాటు పత్తర్ కా ఘోష్, కూర్మ, డబుల్ కా మీఠా లాంటి వంటకాలను ఆరగించారు. తన ఇంటికి వచ్చిన కోహ్లికి సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'ధన్యవాదాలు విరాట్ భయ్యా. నా జీవితంలో ఇదే గొప్ప బహుమతి' అని పోస్టు చేశాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ 11వ సీజన్‌లో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు హైదరాబాద్‌కు రాగానే సిరాజ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. సిరాజ్ ఇంట్లో కోహ్లీతోపాటు జట్టులోని మిగతా ఆటగాళ్లు బిర్యానీని ఆరగించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడగా మూడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ఇప్పటికే బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా తప్పుకుంది.