Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా నాన్న ఉంటే బాగుండేది: మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj says When I wore my cap in Melbourne, I thought dad should’ve been here

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరఫున అరంగేట్ర సమయంలో తన తండ్రి పక్కన ఉంటే బాగుండేదని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సిరాజ్.. అదిరిపోయే ప్రదర్శన చేశాడు.

దీంతో చారిత్రక విజయంలో తనవంతు కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందే తండ్రి చనిపోయాడన్న వార్త అతనికి తెలిసింది. ఇంత బాధను గుండెల్లోనే దాచుకుని.. ఆ సిరీస్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సీనియర్లు లేకున్నా నాలుగో టెస్టులో కేవలం రెండు మ్యాచ్‌ల అనుభవంతో మిగతా యువ బౌలర్లను ముందుండి నడిపించాడు. గబ్బాలో జరిగిన ఆ టెస్టులో ఐదు వికెట్లు సాధించి తనదైన ముద్ర వేశాడు.

మా నాన్న ఉంటే బాగుండేది..

మా నాన్న ఉంటే బాగుండేది..

ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా అరంగేట్రం పర్యటన చాలా కష్టంగా సాగింది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ సమయంలోనే మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. మా కుటుంబ సభ్యులు నాకా విషయం చెప్పలేదు. నేను ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాకే అసలు విషయం తెలిసింది. అప్పుడు కరోనా నిబంధనలు కూడా కఠినంగా ఉన్నాయి. దీంతో మేం క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. తర్వాత మేం ప్రాక్టీస్‌ చేసే సమయంలోనే మా నాన్న కన్నుమూశాడని తెలిసింది'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

అమ్మ చెప్పింది...

అమ్మ చెప్పింది...

'ఆ సమయంలోనే మా అమ్మ నాతో మాట్లాడుతూ నాన్న కోరికని నెరవేర్చి దేశం గర్వపడేలా చేయాలని చెప్పింది. అదే నాకు స్ఫూర్తి కలిగించింది. అయితే, టెస్టు జట్టులో నాకు చోటు లభిస్తుందో లేదో కూడా తెలియదు. అప్పటికే టీమిండియాలో సీనియర్లు ఉన్నారు. కానీ, రెండో టెస్ట్‌కు ముందు మహమ్మద్ షమీ గాయపడటంతో నాకు అవకాశం వచ్చింది. దీంతో మెల్‌బోర్న్‌లో నేను టెస్టు క్యాప్‌ అందుకున్నా.

5 వికెట్లతో..

5 వికెట్లతో..

అప్పుడు మా నాన్న ఉంటే బాగుండేదని అనుకున్నా. ఇండియా-ఏ తరఫున మంచి ప్రదర్శన చేశా.. దీంతో ఇక్కడ కూడా బాగా బౌలింగ్‌ చేస్తాననే నమ్మకం కలిగింది' అని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. కాగా, రెండో టెస్టులో మొత్తం 5 వికెట్లు తీసిన అతడు తర్వాత గబ్బాలో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. దీంతో ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీమ్‌ఇండియా తరఫున అద్భుత అరంగేట్రం చేశాడు.

Story first published: Tuesday, June 7, 2022, 16:20 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+