కోహ్లీ టోలి చౌకీ రావడం సెన్సేషన్.. అదో బిగ్ సర్‌ప్రైజ్: మహమ్మద్ సిరాజ్

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టోలీ చౌకీలోని తన నివాసానికి రావడం బిగ్ సర్‌ప్రైజ్ అని స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. అప్పట్లో విరాట్ తన ఇంటికి రావడం బిగ్ న్యూస్ అని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీ టీమ్‌ను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు విరాట్ కోహ్లీ రాలేనని చెప్పాడని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు. కానీ రానని చెప్పిన విరాట్ కోహ్లీనే అందరితో పాటు తన ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడని, ఇది తన జీవితంలో మరిచిపోలేనని సిరాజ్ తెలిపాడు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో ఈ హైదరాబాద్ పేసర్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీమ్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సిరాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ తన జీవితాన్నే మార్చేసిందని చెప్పాడు.

బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్..
‘ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆర్‌సీబీ టీమ్‌ను డిన్నర్ కోసం మా ఇంటికి ఆహ్వానించాను. విరాట్ కోహ్లీ భయ్యాకు ఈ విషయం చెప్పినప్పుడు వెన్ను పట్టేసిందని రాలేనని చెప్పాడు. దానికి చేసేదేం లేక నేను కూడా రెస్ట్ తీసుకోమని చెప్పా. కానీ అతను మా ఇంటి ముందు కారు దిగడం చూసి షాక్‌కు గురయ్యా. జట్టులోని పార్థివ్ పటేల్, చాహల్‌తో పాటు అందరూ ఉన్నారు. నేను వెంటనే విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి హగ్ చేసుకున్నా. ఇది నా జీవితంలోనే బెస్ట్ సర్‌ప్రైజ్. ఎందుకంటే కోహ్లీ రానని చెప్పి వచ్చాడు. ఇక కోహ్లీ టోలి చౌకీ రావడం అప్పట్లో బిగ్ న్యూస్ అయింది.

డొక్కు ప్లాటినాతో..
క్రికెటర్‌గా ఎదిగేందుకు నేను చాలా కష్టపడ్డాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా నాన్న ఓ ఆటో డ్రైవర్, అమ్మ ఇళ్లలో పనిచేసేది. నా దగ్గర అప్పుడు ఓ డొక్కు ప్లాటినా బైక్ ఉండేది. మా నాన్న రోజు పెట్రోల్ కోసం రూ.60 మాత్రమే ఇచ్చేవాడు. నేను దాంతోనే మ్యానేజ్ చేసేవాడిని. మా ఇంటి నుంచి చాలా దూరం ఉండే ఉప్పల్ స్టేడియానికి ఆ డబ్బులతోనే బైక్‌పై వెళ్లేవాడిని. బండి ఆగిపోతే డక్కా కొట్టేవాడిని.

ఐపీఎల్‌తో లైఫ్ చేంజ్..
అయితే ఐపీఎల్‌కు సెలెక్ట్ అవ్వడంతో నా జీవితమే మారిపోయింది. నా కష్టాలన్నీ కనుమరుగయ్యాయి. నాన్న ఆటో నడపడం, అమ్మ ఇళ్లలో పనిచేయడం మానేసింది. అద్దె ఇంటి నుంచి సొంతింటికి మారం. జీవితంలో నాకు ఇది చాలు. సొంత ఇంట్లో నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలనుకున్నా. అది నెరవేరింది. ఐపీఎల్ నాకు డబ్బుతో పాటు ఫేమ్ ఇచ్చింది. ఈ రోజు ఇలా ఉన్నాననంటే దానికి కారణం ఐపీఎల్'అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.

సన్‌రైజర్స్‌తో షురూ..
2017 ఐపీఎల్ సీజన్‌లో మహమ్మద్ సిరాజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేయగా.. 2018 మెగా వేలంలో ఆర్‌సీబీ అదే ధరకు అతన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న సిరాజ్‌ను.. అప్ కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం రూ.7 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. ఆర్‌సీబీకి ఆడటం వల్ల సిరాజ్.. టీమిండియాకు ఆడటం కూడా సులువైంది. ఇక ఆస్ట్రేలియా పర్యటన అనంతరం అతని కెరీర్ మరింత పీక్స్‌కు చేరింది. జట్టులో కీలక బౌలర్‌గా సిరాజ్ ఎదిగాడు. ఇప్పటి వరకు 50 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 50 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications