డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవాలి: మహమ్మద్ సిరాజ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో ఫైనల్ చేరాలంటే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో విజయం సాధించాలని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన సౌతాఫ్రికాను ఓడిస్తే డబ్ల్యూటీసీ సైకిల్‌లో అగ్రస్థానంలో నిలువవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఈ సైకిల్‌ను టీమిండియా డ్రాతో ప్రారంభించింది. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా 61.5 విన్నింగ్ పర్సంటేజ్‌తో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో కొనసాగుతున్నాయి.

గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా తృటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది. అగ్రస్థానంలో నిలిచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఫైనల్ చేరాయి. సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ప్రారంభం కానుంది. కోల్‌కతా వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌లో పర్యటించిన సౌతాఫ్రికా రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.
సౌతాఫ్రికాతో సిరీస్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన సిరాజ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సిరీస్ ఈ నయా డబ్ల్యూటీసీ సైకిల్‌కు చాలా కీలకం. ప్రత్యేకించి సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి ఆ జట్టును ఓడిస్తే ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి. ఆ జట్టు పాకిస్థాన్‌తో 1-1తో డ్రా చేసుకున్నప్పటికీ.. మా ఫామ్‌పై మాకు నమ్మకం ఉంది. మేం సానుకూల వాతవరణాన్ని సృష్టించాం. ఇంగ్లండ్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేశాం. వెస్టిండీస్‌పై సిరీజ్ గెలిచాం.
వ్యక్తిగతంగా నేను మంచి లయతో బౌలింగ్ చేస్తున్నాను. దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఏంటో తెలుస్తాయి. ఈ సిరీస్‌లో ఎదురయ్యే సవాళ్ల కోసం నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ సైకిల్‌లో మహమ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సైకిల్‌లో సిరాజ్ 7 మ్యాచ్‌లు ఆడి 26.54 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications