విరాట్ కోహ్లీ పెట్టిన బిక్షే.. వేరే ఏ జట్టు అయినా పక్కనపెట్టేసేది: మహమ్మద్ సిరాజ్

న్యూఢిల్లీ: క్రికెటర్‌గా తాను ఈ స్థాయిలో ఉండటానికి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. గడ్డు పరిస్థితుల్లో విరాట్ అండగా నిలిచాడని, అతని మద్దతు వెల కట్టలేనిదన్నాడు. ముఖ్యంగా 2018లో తాను దారుణంగా విఫలమయ్యానని, మరే ఏ జట్టు అయినా తనను జట్టులో నుంచి తప్పించేదన్నాడు. కానీ విరాట్ కోహ్లీ తనకు అండగా నిలిచి తన ఆత్మవిశ్వాసం పెరిగేలా చేశాడన్నాడు. 2018, 19 వరుసగా రెండు సీజన్లలో సిరాజ్ దారుణంగా విఫలమైనా.. విరాట్ కోహ్లీ అతన్ని జట్టు నుంచి తప్పించకుండా అవకాశం ఇచ్చాడు. దాంతో తన సత్తాను నిరూపించుకున్న అతను ఆర్‌సీబీకి ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. తాజా సీజన్ కోసం కూడా ఆర్‌సీబీ.. సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది.

కోహ్లీ వల్లనే ఇదంతా..
ఈ సీజన్ నేపథ్యంలో హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్.. విరాట్ కోహ్లీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.'ఆర్‌సీబీ తరఫున నేను ఆడిన సీజన్లలో 2018 అత్యంత చెత్తది. ఆ సీజన్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను. మరే జట్టు అయినా నాపై వేటు వేసి తప్పించేది. కానీ విరాట్ కోహ్లీ నాకు అండగా నిలిచాడు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం విరాట్ భాయ్. నా బౌలింగ్ మెరుగవ్వడానికి.. ఆత్మవిశ్వాసం పెరగడానికి కోహ్లీనే కారణం. నా కెరీర్ సక్సెస్ పూర్తి క్రెడిట్ అతనిదే. ఒక్క మాటలో చెప్పాలంటే విరాట్ కోహ్లీ పెట్టిన బిక్షే నా ప్రస్తుత జీవితం. కోహ్లీ లేకుండా నేను ఇదంతా సాధించేవాడినే కాదు.

కోహ్లీ లాంటి కెప్టెన్ బౌలర్లకు కావాలి..
విరాట్ కోహ్లీ లాంటి కెప్టెన్ ఉండటం బౌలర్లకు చాలా అవసరం. మైదానంలో విరాట్ దూకుడు, ఎనర్జీ చూసిన తర్వాత బౌలర్‌కు కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఏ బౌలర్‌రైనా తన శక్తిని కోల్పోతే అతను కోహ్లీ వైపు ఒక్కసారి చూస్తే సరిపోతుంది. వెయ్యి ఏనుగుల బలం వచ్చి చేరుతుంది. కోహ్లీ చాలా భిన్నమైన వ్యక్తి.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరణించినప్పుడు కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచాడు. తనను ఎంతో ఎంకరేజ్ చేశాడని సిరాజ్ తెలిపాడు.

రవి సర్ మాటలు..
'మా నాన్న మరణించినప్పుడు రవి సర్ అండగా నిలిచాడు. నాతో ప్రత్యేకంగా మాట్లాడిన రవి సర్..'మియాన్.. ఈ పర్యటనలో నువ్వు ఐదు వికెట్లు ఘనత సాధించాలని మీ నాన్న కోరుకున్నాడు.'అని చెప్పాడు. ఆ మాటలకు నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఇక కఠిన క్వారంటైన్‌లో ఉండటంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే క్వారంటైన్ నేపథ్యంలో భారత్‌కు వెళ్లడం కంటే ఇక్కడే ఉండి నా తండ్రి కలను నేరవేర్చాలనుకున్నాను. అదే నేను అతనికిచ్చే నివాళులని భావించాను. ఆ సిరీస్‌లో నేను మా నాన్న కలను నేరవేర్చడంతో మరింత స్ట్రాంగ్ అయ్యాను. 'అని సిరాజ్ గుర్తు చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications