నా వల్లే రబాడాకు వికెట్లు.. ఆ ప్లాన్‌తోనే సంజూను ఔట్ చేశా: సిరాజ్
ఓవైపు నుంచి తాను బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంతోనే మరోవైపు కగిసో రబాడాకు వికెట్లు దక్కుతున్నాయని గుజరాత్ టైటాన్స్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. పక్కా ప్లాన్‌తో సంజూ శాంసన్‌ను ఔట్ చేశానని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
మహమ్మద్ సిరాజ్ పవర్ పేల్లోనే 3 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. తొలి బంతికే సంజూ శాంసన్(0)ను క్యాచ్ ఔట్ చేసిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(16)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. సిరాజ్ సంచలన ప్రదర్శనతో సీఎస్‌కే 140 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

'నా బౌలింగ్ బాగుంది. నా చేతి నుంచి పర్‌ఫెక్ట్ డెలివరీలు పడుతున్నాయి. ప్రపంచ కప్ సమయంలో నేను తుది జట్టులో లేకపోవడంతో మ్యాచ్‌కు కావాల్సిన రిథమ్‌ను కొద్దిగా మిస్సయ్యాను. దాంతో నా పాత బౌలింగ్ వీడియోలను చూశాను. ఇప్పుడు ఆ రిథమ్ మళ్లీ దొరికింది.
ప్రాక్టీస్ సమయంలో.. నేను నా లైన్ అండ్ లెంగ్త్, రిథమ్‌ను మెరుగుపరుచుకోవడానికి కొత్త బంతితో బౌలింగ్ చేస్తుంటాను. ఆ తర్వాతే యార్కర్ల కోసం ప్రయత్నిస్తాను. ఇది ఎర్రమట్టి పిచ్. దాంతో బ్యాటర్లు కవర్స్ దిశగా షాట్లు ఆడేలా బంతులు వేసాను. సంజూ శాంసన్ వికెట్ విషయంలో నేను అనుకున్న ప్రణాళిక ఇదే. అది సరిగ్గా వర్కవుట్ అయింది.
పవర్‌ప్లేలో బౌలింగ్ చేసేటప్పుడు.. ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తీసుకురావడమే నా తొలి ప్రాధాన్యత. మనం ఒకవైపు నుంచి ఒత్తిడి పెంచితే.. అవతలి ఎండ్ నుంచి రబాడా లాంటి బౌలర్లు సులువుగా వికెట్లు తీయగలరు. బౌలింగ్‌లో భాగస్వామ్యాలు అంటే ఇలాగే ఉండాలి.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications