Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ లాస్ట్ ఓవర్ ఏమో కానీ భయ్యా.. గుండెలో రైళ్లు పరుగెత్తాయి: మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj says My heart was racing after defending 15 runs in final-over thriller vs West Indies

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో టీమిండియా అద్భుత విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా.. సిరాజ్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

చివరి మూడు బంతుల్లో సిరాజ్ ఒక్క బౌండరీ ఇచ్చినా మ్యాచ్ టైగా మారేది. కానీ హైదరాబాద్ గల్లీ బాయ్ తన యార్కర్లతో విధ్వంసకర వీరులైన విండీస్ బ్యాటర్లను కట్టడి చేసి చిరస్మరణీయ విజయాన్నందించాడు. అయితే ఈ ఓవర్ వేసేటప్పుడు తన గుండెలో రైళ్లు పరుగెత్తాయని సిరాజ్ తెలిపాడు. చాలా ఉత్కంఠకు గురయ్యానని చెప్పి సిరాజ్.. అంతే ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాననన్నాడు.

రైళ్లు పరుగెత్తాయి..

మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్‌తో సరదాగా మాట్లాడిన సిరాజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను నా యార్కర్లను నమ్ముకున్నాను. వాటినే చివరి ఓవర్‌లో అస్త్రంగా వాడుకున్నాను. కానీ ఆ సమయంలో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కానీ నేను మాత్రం మ్యాచ్ గెలిపించగలననే ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 57 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసాడు. షైహోప్‌తో పాటు విధ్వంసకర నికోలస్ పూరన్‌ను ఔట్ చేశాడు.

గబ్బర్ సెంచరీ మిస్..

గబ్బర్ సెంచరీ మిస్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్‌మన్‌ గిల్‌ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64), శ్రేయస్‌ అయ్యర్‌ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్‌ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

థ్రిల్లింగ్ విక్టరీ..

థ్రిల్లింగ్ విక్టరీ..

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చహల్‌ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Sunday, July 24, 2022, 11:24 [IST]
Other articles published on Jul 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+