Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫస్ట్ ఐపీఎల్ సాలరీతో ఐఫోన్, సెకండ్ హ్యాండ్ కారు కొన్నా: మహమ్మద్ సిరాజ్

Mohammed Siraj says I bought an iPhone 7 plus on first thing he did after getting picked in IPL

హైదరాబాద్: తన ఐపీఎల్ తొలి జీతంతో ఐఫోన్ 7 ప్లస్‌తో పాటు సెకండ్ హ్యాండ్ కారు కొన్నానని టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. ఓ సాదా సీదా ఆటో డ్రైవర్ కొడుకు అయిన సిరాజ్ గల్లీ క్రికెటర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి భారత ప్లేయర్‌గా ఎదిగిన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాద్ తరఫున రంజీ క్రికెట్‌లో సత్తా చాటిన సిరాజ్‌ను 2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌తో సిరాజ్ తలరాత మారిపోగా.. 2018 వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) సొంతం చేసుకున్న తర్వాత జీవితమే మారిపోయింది.

ఆర్‌సీబీతో..

ఆర్‌సీబీతో..

అక్కడి నుంచి సిరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న సిరాజ్.. ఆటగాడిగా ఎంతో పరిణీతి సాధించాడు. టాప్ క్లాస్ బౌలర్‌గా మారాడు. దాంతో అప్ కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం కూడా ఆర్‌సీబీ సిరాజ్‌ను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు)... గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు)తో పాటు సిరాజ్‌ను రూ.7 కోట్లకు అంటిపెట్టుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మెగా ఆక్షన్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్లు చేపట్టిన ఆర్‌సీబీ... ఓ పాడ్‌కాస్ట్‌ ట్రెయిలర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో సిరాజ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సెకండ్ హ్యాండ్ కారు..

సెకండ్ హ్యాండ్ కారు..

ఐపీఎల్‌ ఆడటంతోనే తన జీవితం మారిపోయిందన్న సిరాజ్.. తన మొదటి ఐపీఎల్ జీతంతో మొదటగా కొనుగోలు చేసిన వస్తువులేమిటో తెలిపాడు. ‘ముందుగా నేను ఐఫోన్‌ 7+ కొన్నాను. ఆ తర్వాత ఓ సెకండ్‌ హ్యాండ్‌ కార్‌. కరోలా(టయోటా). ఎందుకంటే ఐపీఎల్‌ ఆడే వాళ్లకు కారు ఉండాలి కదా! ఎంతకాలమని ప్లాటినా(బైక్‌) మీద తిరగుతాను. అందుకే కారు కొన్నా. వాస్తవానికి అప్పుడు నాకు డ్రైవింగ్‌ రాదు. మా అంకుల్‌ వాళ్ల కొడుకుకు డ్రైవింగ్‌ తెలుసు. అందుకే నేను బయటికి వెళ్లిన ప్రతిసారి అతన్నే తీసుకువెళ్లేవాడిని'' అని చెప్పుకొచ్చాడు.

Mohammed Siraj A Loaded Missile | IND VS SA Series | Oneindia Telugu
విండోస్ తెరిచే..

విండోస్ తెరిచే..

‘నిజానికి నా కారులో ఏసీ ఉండేది కాదు. అందుకే బయటకు వెళ్లినపుడల్లా కిటికీలు తెరిచే ఉండేవి. అభిమానులు నన్ను గుర్తుపట్టి చీర్‌ చేసేవాళ్లు. ఎంతో సంతోషంగా అనిపించేది. ఆ తర్వాత ఏడాదికి మెర్సిడెస్‌ కొన్నాను.'అని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో సిరాజ్ అదరగొట్టాడు. తొలి టెస్ట్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే రెండో టెస్ట్‌లో తొడ కండరాల గాయానికి గురైన సిరాజ్.. మూడో టెస్ట్‌తో పాటు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌‌తో మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Tuesday, February 1, 2022, 17:35 [IST]
Other articles published on Feb 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+