Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరామంతో బద్దకం ఎక్కువైంది.. బౌలింగ్ పదును తగ్గింది: మహమ్మద్ సిరాజ్

రెండు నెలల సుదీర్ఘ విరామం తన బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. పేస్‌తో పాటు బౌలింగ్‌పై నియంత్రణ కోల్పోయానని ఈ తెలంగాణ డీజీపీ చెప్పుకొచ్చాడు. సుదీర్ఘ విరామాలను తన శరీరం తట్టుకోలేదని తెలిపాడు. రెండు నెలల విరామం కారణంగా తాను బద్దకంగా మారానని చెప్పుకొచ్చాడు.

Duleep Trophy 2026: సౌత్‌జోన్ కొంపముంచిన సిరాజ్.. ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్!

Duleep Trophy 2026: సౌత్‌జోన్ కొంపముంచిన సిరాజ్.. ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్!

ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌తో పాటు చెన్నై వేదికగా జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో సిరాజ్ తేలిపోయాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తన చెత్త బౌలింగ్‌తో సౌత్ జోన్ ఓటమికి కారణమయ్యాడు. ఆ జట్టు తరఫున 41 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 44 ఓవర్లు వేసాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్రీలంక పర్యటనలో అతని బౌలింగ్ వేగం గంటకు 140 కిలోమీటర్ల నుంచి 120 130 కిలోమీటర్ల వేగానికి పడిపోయింది. దాంతో బ్యాటర్లను సిరాజ్ ఇబ్బంది పెట్టలేకపోయాడు.

Mohammed Siraj Reveals Why His Bowling Speed Dropped During Sri Lanka Test Series and Duleep Trophy Final

సుదీర్ఘ విరామంతో దెబ్బతిన్న రిథమ్..

తన వైఫల్యం గురించి మాట్లాడిన సిరాజ్.. సుదీర్ఘ విరామం తన బౌలింగ్ లయను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. తనకు చిన్నపాటి విరామాలు సరిపోతాయని సెలెక్టర్లకు పరోక్షంగా సూచించాడు. 'రెండు నెలల విరామం తర్వాత నేరుగా మ్యాచ్ బరిలోకి దిగడంతో నా బౌలింగ్ రిథమ్ దెబ్బతిన్నది. నేను పూర్తిగా నా రిథమ్‌పై ఆధారపడే బౌలర్‌ను.

IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!

Also Read

IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!

నా రన్నప్, బౌలింగ్ శైలి సమన్వయం లేకపోతే.. పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేను. శ్రీలంక పర్యటనలో నేను ఎదుర్కొన్న సమస్య ఇదే. నా రన్ అప్ అస్తవ్యస్తంగా అనిపించేది. కొన్ని అడుగులు మరీ చిన్నవిగా.. మరికొన్ని మరీ పొడవుగా ఉండేవి. దాని వల్ల నా రిథమ్ దెబ్బతిని వేగం తగ్గిపోయింది.

దులీప్ ట్రోఫీతో రిథమ్ రీసెట్..

దులీప్ ట్రోఫీలో నా రిథమ్ సెట్ అయ్యింది. వేగం కూడా సహజంగానే పెరిగింది. కానీ ఇక్కడి కండిషన్స్ చాలా కఠినంగా ఉన్నాయి. మేం శ్రీలంకతో రెండో టెస్ట్‌లో మూడున్నర రోజులు ఫీల్డింగ్ చేసి నేరుగా ఈ మ్యాచ్ బరిలోకి దిగాం. వారం రోజుల వ్యవధిలోనే చెన్నైలోని ఉక్కపోత వేడి వాతావరణంలో ఆడాల్సి వచ్చింది. కానీ నా వరకూ.. ఇదంతా అభిరుచికి సంబంధించిన విషయం.

దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. సాకులు చెప్పడానికి వీల్లేదు. జట్టు, దేశం కోసం సాయశక్తులా కృషి చేయాలి. వికెట్లు దక్కకపోయినా.. ఈ కఠోర శ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఫలితం దక్కుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు తిరిగి రిథమ్ అందుకోవడమే నా ప్రధాన లక్ష్యం.

IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!

Recommended For You

IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్!

వరుసగా ఆడటమే నా బలం..

ఈ మ్యాచ్ ఆడటం నాకు ఎంతో ఉపయోగపడింది. రెండు నెలల విరామం లభిస్తే.. శరీరం మునపటిలా స్పందించదు. ప్రతీది నెమ్మదిగా అనిపిస్తుంది. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా నా శరీరానికి శక్తి తిరిగి రాగా.. నా రిథమ్ కూడా లభించింది. నా శరీరం ఇలానే పని చేస్తుంది. సుదీర్ఘ విరామాలను సహించదు. కొద్దిపాటి విశ్రాంతి అయితే సరిపోతుంది. కానీ నా 10 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో నేను ఎప్పుడూ రెండు నెలల పాటు విరామం తీసుకోలేదు.

అందుకే నేను ఎంత ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే అంత బాగా ఆడుతాను. నేను లాంగ్ స్పెల్స్ వేయకపోతే.. నా పాత బౌలింగ్ తిరిగి రాదు. ఈ విరామం వల్ల నా శరీరం కాస్త బద్దకించింది. నేను ఈ మ్యాచ్‌లో 10, 11 ఓవర్ల స్పెల్స్ వేసాను. అందుకే నా బౌలింగ్ రిథమ్‌ను తిరిగి పొందగలిగాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, September 11, 2026, 13:56 [IST]
Other articles published on Sep 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+