Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ భయ్యా.. నా కన్నీళ్లు తుడిచాడు.. అతనికి రుణపడి ఉన్నా: మహ్మద్ సిరాజ్

Mohammed Siraj reveals how Virat Kohli has backed him throughout his career

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి తాను ఎంతో రుణపడి ఉన్నానని హైదరాబాద్ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. కెరీర్‌, జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు తనకు అండగా నిలిచాడన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు తన కన్నీళ్లు తుడిచి ఓదార్చడాని పేర్కొన్నాడు. తన కెరీర్ సక్సెస్‌ ప్రతీ అడుగులో విరాట్ కోహ్లీ ఉన్నాడని తెలిపాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్దమవుతున్న ఈ హైదారబాద్ పేసర్.. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

నా కన్నీళ్లు తుడిచాడు..

నా కన్నీళ్లు తుడిచాడు..

'విరాట్ భయ్యా నాకు అండగా నిలిచాడు. నా సక్సెస్ ప్రతీ అడుగులో అతని పాత్ర ఉంది. నీకు సామర్థ్యం ఉంది.. ఏ వికెట్‌పై అయినా ఆడగల సత్తా ఉంది. ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్‌ పంపించగలవని విరాట్‌ భయ్యా ఎప్పుడూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో మా నాన్న చనిపోయారు. ఆ బాధలో నేను ఎడూస్తూనే ఉన్నాను. ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను. అప్పుడు విరాట్‌ భయ్యా నా గదికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు అండగా నిలిచాడు.

ప్రతీ అడుగులో..

ప్రతీ అడుగులో..

నా కెరీర్‌, జీవితంలో ప్రతి దశలో విరాట్‌ భయ్యా నాకు మద్దతిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకోసం ఉంటాడు. హోటల్‌ గదిలో నేనెంతగా ఏడ్చానో నాకు గుర్తుంది. నేను నీతో ఉన్నాను. ఆందోళన చెందకని ఓదార్చాడు. అతని మాటలు నాకు స్పూర్తినిచ్చాయి. ఆ పర్యటనలో విరాట్ ఆడింది ఒక్క టెస్టు అయినా సందేశాలు, ఫోన్‌కాల్స్‌తో నాలో స్ఫూర్తి నింపాడు. అతని మద్దతుతోనే నేను రాణించగలిగాను. ఆర్‌సీబీ తరఫున కూడా గత రెండు సీజన్లలో నేను బాగా రాణించలేదు. అయినా నన్ను నమ్మి నాకు అండగా నిలిచాడు.

రుణపడి ఉన్నా..

రుణపడి ఉన్నా..

ఈ మధ్యే సీఎస్‌కే మ్యాచ్‌ తర్వాత విరాట్ భయ్యా నాతో మాట్లాడాడు. నా బౌలింగ్‌లో చేసుకున్న మార్పులు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. జట్టుకు అవి ఉపయోగపడతాయని తెలిపాడు. ఇంగ్లండ్‌ పర్యటనకు సిద్ధంగా ఉండమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకడైన విరాట్ నుంచి అలాంటి మాటలు వస్తే ఎంతో ప్రేరణ కలుగుతుంది. అనుక్షణం నాకు అండగా నిలిచే విరాట్ భయ్యాకు నేనెంతో రుణపడి ఉన్నాను.' అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.

కొత్త సిరాజ్..

కొత్త సిరాజ్..

ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ల గైర్హాజరీలో అవకాశం అందుకున్న సిరాజ్.. అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ పర్యటన అనంతరం అందరికి ఓ కొత్త సిరాజ్ కనిపించాడు. ఆ ఫామ్‌ను ఐపీఎల్ 2021 సీజన్‌లోను కొనసాగించాడు. తన శైలికి భిన్నంగా యార్కర్లు, వైడ్ యార్కర్లతో పొదుపుగా బౌలింగ్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఒకప్పుడు ధారళంగా పరుగులిచ్చి జట్టులో చోటు కోల్పోయిన సిరాజ్.. ఈ సీజన్‌లో సూపర్ బౌలింగ్‌‌తో పేస్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. సిరాజ్‌కు తోడుగా హర్షల్ పటేల్ కూడా దుమ్ములేపడంతో ఆర్‌సీబీ ఈ సీజన్‌లో వరుస విజయాలందుకుంది. కానీ కరోనా కారణంగా లీగ్ అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, May 11, 2021, 19:25 [IST]
Other articles published on May 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+